రూ. 150 కోట్లే కారణమా? పవన్ కళ్యాణ్ మీద వర్మ సంచలన ట్వీట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి రాజకీయాల బాట పట్టారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, అవినీతి రహిత సమాజం స్థాపించడమే ధ్యేయంగా జనసేన పార్టీ పెట్టారు. 'జనసేన' లక్ష్యం అధికారం కాదని, ప్రజల పక్షాన ప్రశ్నించడం అని పార్టీ పెట్టిన కొత్తలో చెప్పిన పవన్ కళ్యాణ్ 2014లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే అసెంబ్లీ బయట ఉండి ప్రశ్నించడం వల్ల మార్పు సాధ్యం కాదని, రాజకీయ అధికారం దక్కించుకుంటేనే ఏదైనా చేయగలమనే విషయాన్ని గమనించిన ఆయన.. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయడంతో పాటు పార్టీ తరుపున పలువురు అభ్యర్థులను బరిలోకి దింపారు. అయితే తొలి ప్రయత్నంలో ఘోర పరాజయం ఎదురైంది.
ఓటమి తర్వాత జనసేన శ్రేణులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్.... మనం ఓడి పోవడానికి ఇతర పార్టీల వారు భారీగా డబ్బు పంచడం కూడా ఓ కారణమనే వార్తలు తన దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. దీనిపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

రూ. 150 కోట్లే కారణమా? ఓటర్లను అవమాన పరచడమే
ఓటర్లకు రూ. 150 కోట్లు పంచడం వల్లే నేను ఓడి పోయాను అని పికె(పవన్ కళ్యాణ్) చెబుతున్నారు. ఇలా అనడం నిజంగా ఓటర్లను అవమాన పరచడమే. తాను సేవ చేయాలనుకున్న ఓటర్లు కరప్ట్ అయినట్లు చెప్పడమేనా ఆయన మాట్లో ఉద్దేశ్యం? అంటూ రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు.
ఒకవేళ ఆయనే కావాలనుకుంటే..?
ఓటర్లకు పవన్ కళ్యాణ్ కావాలని అనుకుంటే.. వారు ఇతరుల నుంచి డబ్బు తీసుకున్నప్పటికీ అతడికే ఓటు వేసేవారు. ఒక వేళ పికె కూడా ఓట్ల కోసం డబ్బు పంచి ఉంటే గెలిచేవారనా? ఆయన మాటల్లో అర్థం ఏమిటి?.. ఊరికే అడుగుతున్నా అంటూ వర్మ ట్వీట్ చేశారు.
అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందేమిటి?
‘‘టీవీలో పికె చెప్పిన మాటలు విని ట్వీట్ పెట్టావ్.. మరి అదే టీవీలో జనాలకి డబ్బులు పంచటం కూడా చూపించారు. మరి అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది ఏమి Justasking.'' అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మకు కౌంటర్ ఇస్తున్నారు.
ప్రజలు లాయల్‌గా ఉన్నారు సర్
ప్రజలు ఎప్పుడూ నమ్మకంగా ఉంటారు సర్. అందుకే వారు ఎవరి వద్ద అయితే డబ్బు తీసుకున్నారో వారికే ఓటు వేశారు. అంటే మీరు ప్రజలు నమ్మకంగా ఉండొద్దని అనకుంటున్నారా?... ఇలా అనడం వారిని అవమాన పరచడమే అంటూ వర్మ ట్వీట్‌ను ఉద్దేశించి మరో అభిమాని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











