ఆత్మవిశ్వాసానికి పెట్టింది పేరు దర్శకుడు వైవియస్ చౌధరి. దర్శక నిర్మాతగా ఆయన ఒక్క మగాడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్న సంగతి తెలిసిందే. తెలియని విషయం ఏమంటే ఆ సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని వైవియస్ చౌదరి కాన్పిడెంట్ గా చెప్పడం. ఒక్క మగాడు సినిమా బాగాలేదని ఒక్క ఫ్యాన్ కూడా చెప్పలేడని...ఫ్యానేం ఖర్మ ఫ్యాన్ కానివారు కూడా ఆ సినిమా బాగోలేదని చెప్పలేరని వైవియస్ అంటున్నారు. ఇంకో విషయం ఏమంటే ఈ సినిమాను చూసిన వారెవరైనా బాగోలేదని చెప్పగలిగితే వారిని కచ్చితంగా అభినందిస్తానని అంటున్నారు. వైవియస్ చౌదరి తను తీసిన సినిమాపై ఉన్న నమ్మకంతో చెబుతున్నారు. సంతోషమేకానీ....ఈ టైపు స్టేట్ మెంట్లను కచ్చితంగా సినిమా సెల్ఫ్ ప్రమోషన్ అంటారు మరి.