»   » నేను చేసిన తప్పు అదే... మళ్లీ కనిపించను: రాజమౌళి

నేను చేసిన తప్పు అదే... మళ్లీ కనిపించను: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ 'బాహుబలి' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ సినీ ప్రేక్షకులు ఇంత వరకు ఎన్నడూ చూడని ఒక అద్భుతాన్ని వెండితెరపై సృష్టించారు. దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకలు నిరాజనాలు పట్టారు. త్వరలో రాబోతున్న బాహుబలి-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాముబలి పార్ట్ 1లో రాజమౌళి కూడా గెస్ట్ రోల్ చేసారు. ఓ పాటలో మద్యం అమ్ముతూ కనిపించారు. రెండో భాగంలోనూ ఆయన కనిపిస్తారా? లేదా? అనేది అభిమానుల్లో ఉన్న ప్రశ్న. ఇటీవల మీడియా మీట్లో రాజమౌళికి ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

Playing a cameo role in the first part itself is a big mistak: Rajamouli

దీనికి రాజమౌళి స్పందిస్తూ 'మొదటి భాగంలో నేను గెస్ట్ రోల్ చేసి చేసి పెద్ద తప్పు చేసారు. మళ్లీ అలాంటి తప్పును రిపీట్ చేయాలనుకోవడం లేదు. అందుకే రెండో భాగంలో నేను కనిపించను' అని రాజమౌళి తెలిపారు.

బాహుబలి-2 రిలీజ్ డేట్ ఆల్రెడీ ఖరారైంది. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

English summary
“Playing a cameo role in the first part itself is a big mistake that I committed regarding the project. I will not repeat it in the second part,” answered Rajamouli leaving everyone in shock. So, Rajamouli admitted a mistake regarding Baahubali. The second part of the film is releasing on 28th April 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu