For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దయచేసి నన్ను బ్యాన్ చేయండి: దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన కంగనా

  |

  'జడ్జిమెంటల్ హై క్యా' మూవీకి సంబంధించిన సాంగ్ లాంచ్ ఈవెంటులో... హీరోయిన్ కంగనా రనౌత్ ఓ జర్నలిస్టుతో గొడవ పడటం, ఆమె తీరుపై మీడియా వారంతా ఆందోళనకు దిగడం తెలిసిందే. వెంటనే కంగనాతో పాటు చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే సినిమా కవరేజ్ బహిష్కరిస్తామని ఫిల్మ్ జర్నలిస్టులు హెచ్చరించారు. దీనిపై ఏక్తా కపూర్ క్షమాపణలు కోరినప్పటికీ... కంగనా మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా కంగనా... తనపై ఆందోళన చేస్తున్న జర్నలిస్టులను ఉద్దేశించి సంచలన వీడియో విడుదల చేశారు.

  మీడియా నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది

  మీడియా నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది

  ఈ రోజు నేను ఇండియన్ మీడియా గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రతి చోట మంచి వారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. నా కెరీర్ మొదటి నుంచి మీడియా నాకు ఎంతో సపోర్ట్ చేసింది. నాకు మీడియాలో చాలా మంచి మిత్రులు ఉన్నారు. వారు నేను ఈ స్థాయికి రావడంలో కీలక పాత్ర పోషించారు.

  ఇలాంటి వారు దేశానికి ముప్పు

  ఇలాంటి వారు దేశానికి ముప్పు

  కానీ కొందరు మీడియా వారు... మన దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ దేశ గౌరవాన్ని, ఐక్యతను, సమగ్రతను దెబ్బతీసే విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారు. వారి సిద్ధాంతాలను జనంపై రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. మన రాజ్యాంగంలో వారిని అడ్డుకోవడానికి ఎటువంటి నిబంధన లేవు, ‘ఉదారవాదులు' అని పిలవబడే వీరిని నేను ఈ దేశానికి ముప్పుగా భావిస్తున్నాను. ఒక జర్నలిస్టును నేను ఢిల్లీలో కలిశాను. చాలా సీరియస్‌గా ప్లాస్టిక్ బ్యాన్, జంతు హింసకు వ్యతిరేకంగా నేను కాంపెయిన్ చేస్తుంటే ఇతడు నాపై జోకులు వేస్తూ ఆర్టికల్ రాశాడు.

  వీరు ఉచితంగా తిండి దొరుకుతుందనే ప్రెస్ మీట్లకు వస్తారు

  వీరు ఉచితంగా తిండి దొరుకుతుందనే ప్రెస్ మీట్లకు వస్తారు

  కొందరికి మీడియా సమావేశంలో ఎలా వాదించాలో కూడా తెలియదు. ప్రెస్ మీట్లలో అనవసర విషయాలు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్లు అరుస్తారు. వీరంతా ప్రెస్ మీట్లకు వచ్చేది ఉచితంగా తిండి దొరుకుతుందని మాత్రమే. నేను ఒక ఆర్టిస్టును అని చెప్పుకోవడానికి కొన్ని సినిమాలు చూపిస్తా... మీరు రాసిన ఒక్క ఆర్టికల్ చూపించండి. అవేవీ లేనపుడు మీరు జర్నలిస్టులం అని ఎలా చెప్పుకుంటారు? అతడు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పడానికి ఎందుకు నిరాకరించాను అంటే దేశ వ్యతిరేక వాదులకు నేను సమాధానం చెప్పను కాబట్టే... అని కంగనా స్పస్టం చేశారు.

  మీకు నా కెరీర్ నాశనం చేసేంత సీన్ లేదు

  మీకు నా కెరీర్ నాశనం చేసేంత సీన్ లేదు

  ఈ ముగుర్గురు నలుగురు కలిసి నాపై వ్యతిరేకంగా ఒక గ్రూపు క్రియేట్ చేశారు. రెండు రోజుల క్రితం ఏర్పడిన వీరి గ్రూపుకు ఒక గుర్తింపు కూడా లేదు. మీరు నన్ను బ్యాన్ చేస్తారని బెదిరిస్తున్నారా? నా కెరీర్‌ను నాశనం చేస్తారా? (నవ్వుతూ).. మిమ్మల్ని కొనడానికి లక్షల రూపాయలు అవసరం లేదు. రూ. 50-60 రూపాయలకు కూడా కక్కుర్తి పడతారు. అలాంటి మీరు నన్ను నాశనం చేస్తారా?.. అంటూ కంగనా ఫైర్ అయ్యారు.

  దయచేసి నన్ను బ్యాన్ చేయండి

  దయచేసి నన్ను బ్యాన్ చేయండి

  నకిలీ జర్నలిస్టులంతా కలిసి మాఫియాగా ఏర్పడ్డారు...నన్ను సినిమాల్లోకి తీసుకోనివ్వమని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మీ వల్ల నేను ఈ దేశంలోనే టాప్ నటిగా, హయ్యెస్ట్ పేయిడ్ ఆర్టిస్టుగా ఎదగలేదు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. దయచేసి నన్ను బ్యాన్ చేయండి. నా గురించి వార్తలు రాయడం వల్ల మీ కుటుంబాన్ని పోషించుకోవద్దు... అంటూ కంగనా కౌంటర్ ఇచ్చారు.

  English summary
  Please ban me: Kangana Ranaut reply to media. Here’s a vidoe message from Kangana to all the media folks who have banned her, P.S she has got viral fever hence the heavy voice.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X