twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హ్యాపీ బర్త్‌డే చెప్పకండి ప్లీజ్..: రామ్ గోపాల్ వర్మ

    |

    నేడు క్రియేటివ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ జన్మ దినం.. సాధారణంగా ఎవరి పుట్టిన రోజు నాడైనా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని పెద్దలు కూడా ఆశీర్వదిస్తుంటారు. కానీ మన క్రియేటివ్ డైరెక్టర్‌కు మాత్రం "హ్యాపీ బర్త్‌డే"లంటే మా చెడ్డ చిరాకు. అందరూ పుట్టిన రోజును సంతోంగా జరుపుకుంటుంటే "రాము" మాత్రం తన జీవితంలో ఒక సంవత్సరం వెనక్కు వెళ్లపోయిందని బాధ పడుతున్నారు.

    ఇదే విషయంపై రాము తన ట్విట్టర్ బ్లాగ్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. "నా జీవితంలో ఒక సంవత్సరం తగ్గిపోయింది, అందుకు నాకు నేనే సానుభుతి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నాకో సాయం చేయండి, దయచేసిన నాకు హ్యాపీ బర్త్‌డే చెప్పకండి. ధన్యవాదాలు" అంటూ రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశారు. (రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన సందేశం ఆంగ్లంలో "I jst gave condolences 2 myself tht I hav 1 year lesser in my life to what I want to do..so do me a favour nd don't wish me Happy Bday.thnx".)

    ఇక రామ్ గోపాల్ వర్మ గురించి సంక్షిప్తంగా తెలుసుంటే.. రాము ఏప్రిల్ 7, 1962లో జన్మించారు. విద్యాపరంగా ఇంజనీరింగ్ చేసిన ఈ ఇంజనీర్ తన పనితనాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీపై మరల్చి కొత్త దనాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాలకున్నారు. ఓ ఫిల్మ్ డైరెక్టర్‌గా, స్క్రీన్‌రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా వర్మ ఇటు టాలీవుడ్‌లోనూ అటు బాలీవుడ్‌లోనూ సుపరిచితులయ్యారు. శివ (1989) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షలకు పరిచయం అయిన వర్మ 1995లో రంగీలా చిత్రంతో బాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు.

    ప్రేక్షకులను భయపెట్టడమంటే వర్మకు బహు సరదా.. సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్‌కు సంబంధించివే కాకుండా.. స్టూడెంట్ గ్యాంగ్ వార్స్, కుటిల రాజకీయాలు, యధార్థ జీవిత గాధలు వంటివి తీసి సంచలనాలు సృష్టిస్తుంటాడు. వర్మకు సినిమాలంటే ఉన్న ప్యాషన్‌ను ఇంత వరకూ ఏ భారతీయ ఫిల్మ్ మేకర్‌లోనూ చూడలేదని బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్ కూడా కితాబిచ్చారు. ఏదైతే వర్మ వద్దన్నా సరే మనం మాత్రం హ్యాపీ బర్త్‌డే చెప్పేద్దాం... హ్యాపీ బర్త్‌డే మిస్టర్ రామ్ గోపాల్ వర్మ..!

    English summary
    Today our creative director Ram Gopal Varma birthday. On this occasion Varma posted on his twitter blog saying.. "I jst gave condolences 2 myself tht I hav 1 year lesser in my life to what I want to do..so do me a favour nd don't wish me Happy Bday.thnx". Varma was born on April 7, 1962 and he has the academic qualifications of an engineer but he turned into a film director, a screenwriter and a producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X