twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్-జూ ఎన్టీఆర్-మహేష్ హ్యాపీ....వీళ్లు తన్నుకోవడమెందుకో?

    By Bojja Kumar
    |

    అభిమానం అభిమానంలా ఉంటే ఒకే...అదే మితిమీరితే? హద్దులు దాటితే? శృతి మించితేనే సమాజానికి ప్రమాదం. ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నది అదే. మెగా స్టార్, నందమూరి కుటుంబాలకు చెందిన హీరోల అభిమానులు, హీరో మహేష్ బాబు అభిమానులు ఒకపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. యుద్ధరంగాన్ని తలపిస్తున్నారు. ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ తీవ్రమైన పదజాలంతో ప్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలీసుల వ్యవస్థ అనేది లేకుంటే వీళ్ల వ్యవహారం ఎంత భయంకరంగా ఉంటుందో? మరి ఎందుకీ ఉన్మాదం? ఎందుకీ గొడవలు, ఎందుకీ పగలు, ప్రతీకారాలు? అభిమానులారా.. మీరు ప్రయాణిస్తున్న మార్గం ఇలా ఎక్కడి వరకు?

    మరి హీరోల మధ్య ఏమైనా గొడవలున్నాయా? ఏమైనా విబేధాలున్నాయా? అంటే ఏమీ లేదు. వాళ్లు వాళ్లు బాగానే ఉన్నారు. ఇటీవల రామ్ చరణ్ నిశ్చితార్థంలో పవన్ కళ్యాణ్, జూ ఎన్టీఆర్ చాలా క్లోజ్ గా ముచ్చట్లాడుకోవడమే ఇందుకు నిదర్శం. ఇక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. జల్సా సినిమాకు మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే ఇందుకు తార్కాణం. ఇది ఒకరకంగా మేమంతా కలిసే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మా మధ్య విబేధాలు, గొడవలు లేవని ఫ్యాన్స్ లోకాని వారంతా ఇచ్చిన సందేశం.
    ఈ విషయాన్ని ఇప్పటికైనా అభిమానులు గుర్తిస్తే మంచిదని అందరి అభిప్రాయం.

    తమ అభిమానాన్ని చాటు కోవడం పోటీ పండటంలో తప్పులేదు. కానీ మార్గం ఇది ఎంత మాత్రం కాదు. సినిమాను విజయంవంతం చేయడంలో పోటీ పడండి...పరిశ్రమ బాగుపడుతుంది. హీరో పేరు చెప్పి ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడండి మీ హీరోతో పాటు ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ ఇలా ఒకరిపై ఒకరు విద్వేషాలు, ప్రతీకారాలు పెంచుకోవడం ద్వారా జరిగేది హింస, వినాశనం తప్ప మరేమీ మిగలదు.

    English summary
    People Requesting to Pawan Kalyan, Jr NTR and Mahesh babu fans..."Please stop Revenge and Such acts".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X