హీరోల ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తే సగం పని అయినట్లే
తెలుగులో అతి తక్కువ కాలంలోనే ఎదిగిన తమన్ తన విజయ రహస్యం గురించి చెబుతూ...నేను మణిశర్మ గారి దగ్గర ఎనిమిది సంవత్సరాలు చేసాను. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. నేను సంగీతం కంపోజ్ చేసేటప్పుడు..హీరో ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేస్తాను. ఎందుకంటే ప్రతీ హీరోకి ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. దాన్ని ఎలివేట్ చేసేలా మన సంగీతం సాగాలని భావిస్తాను. అలాగే మొదట హీరో ప్యాన్స్ కి సంగీతం నచ్చితే సగం సక్సెస్ అయినట్లే అన్నారు. అలాగే ఈ 2010 సంవత్సరం తనకు బాగా కలిసి వచ్చిందని చెప్పారు. ఎన్టీఆర్ తో చేసిన బృందావనం చిత్రం తనకు బాగా పేరు తెచ్చిపెట్టిందని, రగడ, మిరపకాయ పాటలు కూడా పెద్ద హిట్టవటం సంతోషంగా ఉందని అన్నారు. ఇక రవితేజ కిక్ తో పరిచయం అయిన తమన్..ప్రస్తుతం మహేష్ బాబు తాజా చిత్రం దూకుడుకి పాటలు అందిస్తున్నాడు. అలాగే రవితేజతో వీర, ప్రభాస్ తో రెబెల్ చిత్రాలు చేస్తున్నారు. మరికొన్ని డిస్కషన్ స్టేజిలో ఉన్నాయని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











