'అజ్ఞాతవాసి' ప్లస్&మైనస్: త్రివిక్రమ్ ఎక్కడ తగ్గాడు.. ఎక్కడ నెగ్గాడు!
Recommended Video

అరుపులు, కేకలతో థియేటర్ దద్దరిల్లుతుంటే.. పవన్ సినిమా మొదటి రోజు మొదటి ఆట చూడటంలో ఆ కిక్కే వేరప్పా!. 'అజ్ఞాతవాసి'పై ఏ అభిమాని నోట విన్నా ఇప్పుడిదే మాట. తెరపై పవన్ ఇమేజ్‌ను శిఖర స్థాయిలో నిలబెట్టే త్రివిక్రమ్ మ్యాజిక్ కోసం వాళ్ల వెంపర్లాట. మరి 'అజ్ఞాతవాసి' వాళ్ల అంచనాలను అందుకుందా?.. బయట టాక్ ఎలా ఉందో చూద్దాం.

అజ్ఞాతవాసి ప్లస్ పాయింట్స్:
- కుష్బూ-పవన్ సెంటిమెంట్
- పవన్ కల్యాణ్ పెర్ఫామెన్స్
- ఇంటర్వెల్ బ్యాంగ్
- బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
- కథా ట్రీట్‌మెంట్
- స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్:

హీరోయిన్లకు ప్రాధాన్యత లేదు..:
సినిమాలో పవన్ కల్యాణ్‌ను సరికొత్తగా, ముఖ్యంగా లుక్స్ పరంగా త్రివిక్రమ్ బాగా ప్రెజెంట్ చేయగలిగాడన్న టాక్ వినిపిస్తోంది. నటీనటులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నప్పటికీ.. హీరోయిన్ల పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేదని చెబుతున్నారు.

ఆ రెండూ..:
'అజ్ఞాతవాసి'కి స్క్రీన్ ప్లే మైనస్ అయిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. కథకు సంబంధించిన ట్రీట్‌మెంట్ కూడా అంతగా ఆకట్టుకోలేదంటున్నారు. త్రివిక్రమ్ ఈ రెండు విషయాలపై మరింత ఫోకస్ పెట్టి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదంటున్నారు.

ఆకట్టుకునే సెంటిమెంట్:
ఇప్పటిదాకా వచ్చిన టాక్ బట్టి చూస్తే.. 'అజ్ఞాతవాసి'కి పవన్-కుష్బూ సెంటిమెంట్ ప్రధాన బలం అని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలతో భావోద్వేగాలతో కట్టిపడేస్తాయని అంటున్నారు.

ఫైనల్ రిపోర్ట్?:
ఈ మధ్యాహ్నానికి 'అజ్ఞాతవాసి'పై పూర్తి స్థాయి రిపోర్ట్ బయటకు వస్తుంది. సినిమాపై అభిమానుల అభిప్రాయం, అలాగే విమర్శకుల విశ్లేషణను బట్టి ఒక అంచనాకు రావచ్చు. కాబట్టి ఫైనల్ రిపోర్టు కోసం వేచి చూస్తే తప్ప 'అజ్ఞాతవాసి' ఫలితాన్ని ఇప్పుడే డిసైడ్ చేయలేం.


Click it and Unblock the Notifications











