Don't Miss!
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆమెకు నేనంటే కోపం, ట్విట్టర్లో చూశా: అక్షయ్ కుమార్ భార్యపై ప్రధాని నరేంద్రమోదీ కామెంట్!
Recommended Video
బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ కొట్టేశాడు. దాదాపు ఒక గంట 9 నిమిషాల పాటు వీరి మధ్య కన్వర్జేషన్ సాగింది. ఈ సందర్భంగా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, యాక్టర్ అక్షయ్ కుమార్ మధ్య ఎవరూ ఊహించని, నాన్ పొలిటికల్ చర్చ ప్రస్తావనకు వచ్చింది. సోషల్ మీడియా గురించి, వాటిని ఎలా ఉపయోగిస్తారు అనే అంశాలపై అక్షయ్ కుమార్ ప్రశ్నించారు. దీనికి మోదీ నుంచి ఆసక్తి సమాధానం వచ్చింది.
ట్విట్టర్లో మీ భార్య నాపై ఆగ్రహం వ్యక్తం చేయడం చూశా: మోదీ
ప్రధాని మోదీ స్పందిస్తూ... ‘నేను మీ ట్విట్టర్ ఖాతా చూస్తుంటాను, ట్వింకిల్ జీ ట్విట్టర్ ఖాతా చూస్తుంటాను. ఆమె కొన్ని సార్లు నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు కాబట్టి మీరు ఫ్యామిలీ లైఫ్‌లో ప్రశాంతంగా ఉంటున్నారని భాస్తున్నాను' అంటూ చమత్కరించారు.
మోదీ కామెంటుపై ట్వింకిల్ రియాక్షన్
తన గురించి ప్రధాని మోదీ చేసిన కామెంట్లపై వెంటనే ట్వింకిల్ ఖన్నా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘మోదీజీ మాటలను నేను పాజిటివ్‌గా తీసుకుంటాను. ఆయన నేను చేస్తున్న ట్వీట్స్ గమనిస్తున్నారంటే... నా పనిని కూడా గమనిస్తుంటారని అర్థమైంది' అని పేర్కొన్నారు.
అన్నీ గమనిస్తుంటానన్న మోదీ
సోషల్ మీడియా ద్వారా అన్ని విషయాలను గమనిస్తుంటారు. ప్రజలు అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకుంటాను. నాపై వచ్చే ట్రోల్స్, మీమ్స్ కూడా చూసి ఎంజాయ్ చేస్తాను అని ఈ సందర్బంగా ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
|
వైరల్ అవుతున్న వీడియో
అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ వీడియోను.... ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా బుధవారం ఉదయం విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. దేశ వ్యాప్తంగా మోదీ అభిమానులు, అక్షయ్ కుమార్ అభిమానులు, మోదీ అంటే ఇష్టం లేని వారు తమ తమ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.