twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Kashmir Files: నిజాలు చూపించారు..సినిమాపై మోడీ ప్రశంసలు.. అందరూ చూడాలని విజ్ఞప్తి

    |

    కశ్మీరీ పండిట్ల మీద 1990లో జరిగిన హత్యాకాండ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సినిమా యూనిట్‌ను పిలిపించుకుని మరీ అభినందించారు. దర్శకుడు వివేక్‌ అగ్రిహోత్రి, నిర్మాతలు పల్లవి జోషి, అభిషేక్‌ అగర్వాల్‌ ప్రధానిని కలవగా వారిపై మోడీ ప్రశంసలు కురిపించారు. తాజాగా మరోసారి ప్రధాని ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    రెట్టింపు

    రెట్టింపు


    ఒక రకంగా "ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా సరికొత్త రికార్డు, చరిత్ర సృష్టిస్తోంది. తొలిరోజు దేశవ్యాప్తంగా 600 స్క్రీన్లు మాత్రమే సినిమాకు దక్కాయి కానీ ఆదివారం నాటికి సినిమాపై ప్రేక్షకుల్లో ఏర్పడిన ఆసక్తి కారణంగా స్క్రీన్ కౌంట్ 600 నుంచి 2000 కి పెరిగింది. సినిమా షోలు కూడా ప్రతి నగరంలో రెట్టింపు అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. అ

    రికార్డు స్థాయి కలెక్షన్లు

    రికార్డు స్థాయి కలెక్షన్లు

    నుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి లాంటి వారు తప్ప పెద్ద స్టార్లు లేకుండా దాదాపు 12 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్' 27 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. మొదిటి రోజు తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రారంభం నుంచి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. సినిమాకి మౌత్‌ టాక్‌ పెరగడంతో థియేటర్లు కూడా పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా దాదాపు ముప్పై కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

    సినిమాపై కూడా చర్చ

    సినిమాపై కూడా చర్చ


    అయితే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ‘ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాపై కూడా చర్చ జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. సినిమాలో చూపించిన వాస్తవాన్ని అటకెక్కించే ప్రయత్నం చేశారని అన్నారు. కశ్మీర్‌లో వాస్తవాలను అణిచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

    సినిమా చూడాలని

    సినిమా చూడాలని

    ఈ సినిమా ద్వారా నిజానిజాలు ఎలా బయటపడతాయో చెప్పడమే కాక సత్యాన్ని అణిచివేసేందుకు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అని కూడా ప్రధాని చెప్పారు. కొద్దిరోజుల క్రితం చిత్ర నటీనటులు, నిర్మాతలు ప్రధానిని కలిశారు. మోడీ మాట్లాడుతూ ఇది చాలా మంచి సినిమా. మీరందరూ చూడాలి. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి" అని అన్నారు. మంగళవారం నాడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన వారందరినీ కొత్తగా విడుదల అయిన ‘ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

    Recommended Video

    Nathicharami: మూవీ కి ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అయిపోతారు Arvind Krishna | Filmibeat Telugu
    మాల్వేర్లు రంగంలోకి

    మాల్వేర్లు రంగంలోకి


    మరోపక్క ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా పేరిట మాల్‌వేర్‌ లు దేశంలో ఎంటర్ అయ్యాయి. సోషల్ మీడియాలో అనుమానాస్పద మాల్‌వేర్‌లను హ్యాకర్లు పంపుతున్నట్టు తెలుస్తోంది. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఉచిత యాక్సెస్‌ నెపంతో సోషల్ మీడియా,వాట్సాప్‌లో అనుమానాస్పద లింక్‌లు తిరుగుతున్నాయి. వాట్సాప్‌లో పంపిన మాల్‌వేర్‌లను క్లిక్ చేయడం ద్వారా హ్యాకర్లు ఫోన్‌లను హ్యాక్ చేయడం, మొబైల్ నంబర్‌లకు లింక్ చేసిన బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు షేర్ చేసిన లింక్‌లపై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

    English summary
    PM Narendra Modi praises The Kashmir Files
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X