twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ సుప్రీంకు ‘పిఏం నరేంద్రమోదీ’ వివాదం.. నష్టపోతామంటూ నిర్మాత విన్నపం!

    |

    'పీఎం నరేంద్రమోదీ' బయోపిక్‌ ఏప్రిల్ 11న విడుదలవ్వాల్సి ఉండగా... ఎన్నికల కమీషన్ రిలీజ్ మీద నిషేదం విధించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని, పిఎం నరేంద్రమోదీ బయోజిక్‌తో సహా అన్ని బయోపిక్స్‌ రిలీజ్ నిలిపి వేస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

    ఎన్నికల సంఘం సినిమాను పిలిపి వేయడంతో చిత్ర బృందం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని, ఈ సమయంలో రిలీజ్ ఆపితే భారీగా నష్టపోతామంటూ కోర్టుకు విన్నవించారు నిర్మాత.

     PM Narendra Modi Release issue, SC hearing on April 15

    'పీఎం నరేంద్రమోదీ' నిర్మాత వేసిన కేసును స్వీకరించిన కోర్టు.. ఏప్రిల్ 15న ఈ కేసును విచారిస్తామని తెలిపారు. సోమవారం జరిగే విచారణలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని, సినిమా విడుదలకు అడ్డంకి తొలగిపోతుందనే ఆశాభావంతో ఉన్నారు నిర్మాతలు.

    అంతకు ముందు నరేంద్రమోదీ బయోపిక్‌ను రిలీజ్ చేయాలని దాఖలైన చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెన్సార్ సర్టిఫికెట్ గురించి తాము చెప్పేది ఏమీ లేదు. రిలీజ్ నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి వదిలేస్తున్నామని తెలిపింది.

    సందీప్‌ సింగ్‌ నిర్మాతగా ఓమంగ్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రధాని మోదీ పాత్రను వివేక్‌ ఓబెరాయ్‌ పోషించారు. ఆయన బాల్యం నుంచి ప్రధానమంత్రి అయ్యే వరకు జరిగిన ముఖ్య ఘట్టాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. వివేక్ ఒబెరాయ్‌‌తో పాటు దర్శన్ కుమార్, బోమన్ ఇరానీ, మనోజ్ జోషి, ప్రశాంత్ నారాయణన్, జరీనా వాహెబ్, బర్ఖా బిస్త్ సేన్ గుప్తా, అంజన్ శ్రీవాస్తవ్, యతిన్ కార్యేకర్, రాజేంద్ర గుప్తా, అక్షత్ ఆర్ సలుజా, ముఖ్య పాత్రలు పోషించారు.

    English summary
    Makers of biopic 'PM Narendra Modi' move the Supreme Court against the stalling of the film's release. Supreme Court agrees to hear the case on April 15.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X