అమెరికా అధ్యక్ష్యుడుతో విందుకు ఐష్, అభిషేక్
ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఈ నెల 24న ఒబామా ఆతిధ్యం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటయ్యే ప్రత్యేక విందుకు మరో 10 మంది భారతీయ ప్రముఖులతో జాబితా రెడీ అయ్యింది. వారిలో సినీ పరిశ్రమనుంచి ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ ఉన్నారు. ఈ వివరాలను వైట్ హౌస్ సమాచారం తెలిపే పొల్టికో న్యూస్ మేగజీన్‌లో పొందుపర్చారు. ఈ అతిధి ఆహ్వానితుల్లో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, రచయిత్రి-సామాజికవేత్త అరుంధతీ రాయ్, బాలీవుడ్ స్టార్ దంపతులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, వరల్డ్ ఈజ్ ఫ్లాట్ పుస్తక రచయిత థామస్ ఫ్రైడ్మెన్ ఉన్నారు. మొత్తానికి భారత సినీ పరిశ్రమ ప్రతినిధులుగా మంచి ఛాన్సే కొట్టేసారని బాలీవుడ్ అభిషేక్ దంపతులను అభినందిస్తోంది.
ఒబామా ఐశ్వర్యా రాయ్ మన్మోహన్ సింగ్ అబిషేక్ అనీల్ అంబానీ అరుంధతీ రాయ్ బాలీవుడ్ వరల్డ్ ఈజ్ ప్లాట్ obama america manmohan singh abhishek bachchan aishwarya rai anil ambani


Click it and Unblock the Notifications