శివబాలాజి హీరోగా పొదరిల్లు చిత్రాన్ని నిర్మించిన(ఇంకా రిలీజ్ కాలేదు) ఆకుల శివ దుర్గా ప్రసాద్ ని నిన్న(సోమవారం) సాయింత్రం బెంగుళూరు పోలీసులు అరెస్టు చేసారు. దాదాపు ఇరవై కోట్లకు సంభందించిన డీడీల చీటింగ్ కేసులో ఈ నిర్మాతను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆర్ధిక నేరాన్ని గత కొద్ది రోజులుగా సిబిఐ వారు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ద్వారా ఆర్.శ్రీనివాసరావు అనే నూతన దర్శకుడు పరిచయం కావాల్సి ఉంది. అతను నువ్వే కావాలి నుండి డైరక్టర్ విజయ్ భాస్కర్ వద్ద పనిచేసాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా పండ్సే నటించగా..గిరిబాబు,వినోద్ కుమార్ వంటి సీనియర్ నటీనటులు మిగతా పాత్రల్లో చేసారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా రిలీజ్ అవటం కూడా కష్టమేనని తెలుస్తోంది.