అతనో దేవదూత.. సోనూసూద్‌పై పోయెట్రీ వైరల్
సినిమాల్లో మాత్రం విలన్ వేషాలు వేస్తాడు. అతని విలనిజానికి శాడిజానికి కొన్ని సార్లు ప్రేక్షకులకు కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. మరికొన్ని సార్లు విలనిజంలోనూ కామెడీని పండించాడు. అయితే నిజ జీవితంలో మాత్రం ఎంతోమంది ముఖాలపై చిరునువ్వును తీసుకొచ్చాడు. కరోనా లాంటి విపత్కర సమయంలో ఎంతో మందిని ఆదుకున్నాడు రియల్ హీరో, రీల్ విలన్ సోనూ సూద్. ఆర్థిక విరాళం ఇవ్వడమే కాకుండా ఎన్నో రకాలుగా ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేస్తూనే వస్తున్నాడు.
కరోనాలాంటి కష్టం కాలంలో తన చుట్టూ వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య బృందానికి బస చేసేందుకు తన ఖరీదైన హోటల్‌ను విడిదిగా మార్చేశాడు. వలస కార్మికులకు నిత్యం అన్నదానం చేశాడు. ఇందుకు గానూ ట్రక్కుల నిండా ఫుడ్ ప్యాకెట్స్ నింపి సరఫరా చేసేవాడు. రంజాన్ మాసంలో ముస్లింలకు కావాల్సిన డేట్స్, పళ్లను అందించాడు. ఇలా ఎన్నో రకాలుగా ఎంతో మందికి సాయం చేశాడు సోనూ సూద్.

ఈ మేరకు ఓ నెటిజన్ సోనూసూద్‌పై కవితను రాశారు. 'అతను ఒక దేవదూత.. నేడు భూమిపై అవతరించాడు.. మానవ రూపంలో ఉన్న దేవుడ్ని చూశాను నేడు.. అందరి బాధలను దూరం చేయడానికి.. వచ్చాడో దేవదూత.. ముందడుగు వేశాడు.. అందరి ముఖంలో చిరునవ్వు తెప్పించాడు.. అక్కడ ఎవ్వరూ ఒంటరిగా లేదు.. వారందరికీ తోడుగా భగవంతుడు నిల్చున్నాడు'.. అంటూ ఓ కవితను రాశారు నెటిజన్. దీనిపై స్పందించిన సోనూ సూద్.. మాటల్లో వర్ణించలేం.. అద్భుతంగా ఉంది.. నేనో సాధారణ మనిషి.. నా వల్ల సాధ్యమైంది చేస్తున్నానంతేనని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











