పవన్ కళ్యాణ్ తమ్ముడుగా పోకిరి మహేష్ ఫ్రెండ్...
తీన్ మార్ విజయంతో ఆనందంగా ఉన్న పవన్ కళ్యాణ్ అదే ఉత్సాహంతో తదుపరి చిత్రాలకు పనిచేయాలని వడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమంలో మొదట విష్ణు వర్ధన్ దర్శకత్వంలో 'షాడో' ఈ నెలలో ప్రారంభం కానుంది. ఆ తరవాత హిందీ సినిమా 'దబాంగ్' ను 'గబ్బర్ సింగ్'గా తెలుగులో రిమేక్ చేస్తున్న చిత్రంలో పవన్ నటించనున్నాడు. సో పవన్ కి ఇప్పుడు రీమేక్ ల టైం నడుస్తోంది..'గబ్బర్ సింగ్"లో పవన్ కళ్యాణ్ నిర్మాణం జరుగబోతోంది. అంతే కాదు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకం కింద పవన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మే10,11తేదీలలో షూటింగ్ ప్రారంభం కావొచ్చు.
తాజా సమాచారం ప్రకారం పోకిరి సినిమాలో మహేష్ బాబు స్నేహితుడుగానూ, మహేష్ బదులు తనే కవర్ ఏజెంట్ అనే తలంపుని కాసేపు ఇచ్చిన అజయ్ ఈ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ తమ్ముడిగా నటించనున్నాడు. గతంలో విలన్ గా, సహాయనటుడిగా, సారాయి వీర్రాజు సినిమాలో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న అజయ్ ఈ సినిమాలో మంచి పాత్ర దక్కించుకున్నాడు.
దబాంగ్ లో ఆ పాత్రను అర్బాజ్ ఖాన్ చేసాడు. ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ పూర్తి చేసుకుని నటి నటుల ఎంపికలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ ఫై కి వెళ్ళనుంది. కాజల్ అగర్వాల్ పవన్ తో జోడి కడుతున్న ఈ చిత్రానికి మిరపకాయ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ఫై పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అంతే కాదు దబాంగ్ సినిమాని యథాతథంగా కాకుండా, రీమేక్ అనిపించుకోకుండా, పూర్తిగా తెలుగుదనం ఉట్టిపడేట్టుగా స్ర్కిప్ట్ ని తిరగరాయమని పవన్ కళ్యాణ్ హారీష్ కి చెప్పారట.


Click it and Unblock the Notifications











