మహేష్‌బాబు పోకిరి కనక ఝరి
మహేష్‌బాబు- పూరీ జగన్నాధ్‌ల పోకిరి సినిమా సంచలన విజయానికి కారణాలను విశ్లేషించడానికి సినీ ప్రముఖులు ఈ సినిమాను పదే పదే చూస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా మొదటి రెండు వారాల్లోనే కోటి రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. 180 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రానికి రెండో వారంలోనే మరో 45 ప్రింట్లు జోడించారు. ప్రస్తుతం నాలుగో వారంలో ఉన్న పోకిరి పంపిణీదారులకు పెట్టుబడిని వెనక్కి ఇచ్చేసిందని, ఇక రానున్నదంతా లాభమేనని చెబుతున్నారు. పోకిరి కలెక్షన్లు ఇదే విధంగా కొనసాగితే మరో ఆరు వారాల్లో ఈ సినిమా తెలుగు సినిమా కలెక్షన్ల చరిత్రను తిరగరాయగలదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూడు వారాలకే 18 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మొత్తంగా 30 కోట్లు రాబట్టగలదని అంచనా.


Click it and Unblock the Notifications