ప్రిన్స్ మహేష్, పూరి కాంబినేషన్ లో వచ్చిన పోకిరి ఓ కొత్త చరిత్రను క్రియేట్ చేసిందనే సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం తమిళ్ లో విజయ్ హీరోగా అదే పేరుతో రీమేక్ చేసారు. ఇక హిందీలో సల్మాన్ ఖాన్ తో ప్రభుదేవా వాంటెడ్..డెడ్ ఆర్ ఎలైవ్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు కన్నడ వెర్షన్ కి టైమ్ వచ్చింది. కన్నడ రైజింగ్ స్టార్ దర్శన్ హీరోగా చేస్తున్నాడు. సుధాకర్ అనే నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అందుకోసం పద్దెనిమిది లక్షలుకు రీమేక్ రైట్స్ తీసుకున్నారని సమాచారం. ఆ నిర్మాత తెలుగు హ్యాపీ డేస్ సినిమాని జాలీడేస్ పేరుతో కన్నడలో రీమేక్ చేసారు. అక్కడా అదే రేంజి హిట్ ని నమోదు చేస్తుందని ఆశిద్దాం.