ఆమె ప్రవర్తన వల్లే 'పోకిరి'కీ ఆలస్యం

ప్రభుదేవా అసలే నెమ్మిదిగా శిల్పంగా చెక్కుదామని సినిమాను ఆలస్యం చేస్తే సల్మాన్ తనకు చేతనైనంతలో ఆలస్యం చేసాడు. ఇక ఎలాగో ఫినిష్ చేద్దామనుకుంటున్న దశలో ఆయేషా ఈ ట్విస్ట్ ఇచ్చింది.డబ్బింగ్ కి అటెండవటం లేదు.అందులోనూ కొద్దిగా ప్యాచ్ వర్క్ ఉంటే సహకరించటం లేదు. అయితే ఆమె మీద మాత్రం యాక్షన్ తీసుకోవటానికి హక్కు ఎవరికీ లేదుట. ఎందుకంటే ఆమె కమిటయిన డేట్స్ ఎప్పుడో ఫినిష్ అయిపోయాయి.
అందుకే అమ్మా తల్లీ అని పని నడుపుకునే ఆలోచనలో నిర్మాత ఉన్నాడు. చక్కగా ప్రభుదేవా మాత్రం తన తదుపరి తమిళ సినిమాలో పడిపోయాడు. డబ్బు పెట్టిన వాడిదే కదా బాధ అందుకే నిర్మాతే డీలా పడి ఎలాగైనా పూర్తి చేసి రిలీజ్ చేయాలనే పట్టుదలతో తిర్గుతున్నాడు.వీళ్ళంతా జాలితలిస్తే ...సినిమా థియేటర్స్ లో దిగుతుంది.


Click it and Unblock the Notifications











