‘పోకిరి రిటర్న్స్’ టైటిల్ : హీరో ఎవరు?
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘పోకిరి' చిత్రం అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈచిత్రం టేకింగ్, డైలాగ్స్ పరిశ్రమలో సరికొత్త ట్రెండుకు తెర లేపింది. మహేష్ బాబు స్టార్ ఇమేజ్ పెరగడంలో ఈ సినిమా ఎంతగానో తోడ్పడింది.
ఈ క్రమంలో ఫిల్మ్ చాంబర్లో ‘పోకిరి రిటర్న్స్' టైటిల్ రిజిస్టర్ కావడం చర్చనీయాంశం అయింది. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ భీమవరం టాకీస్ బ్యానర్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారు. ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తారు? హీరో ఎవరు? అనే విషయాలు ఇంకా ఏమీ తెలియవు.

గతంలో మహేష్ బాబు నటించిన ‘పోకిరి' చిత్రానికి సీక్వెల్....అనే భావన కలిగేలా ఉండటంతో ఈ టైటిల్ హాట్ టాపిక్ అయింది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఇటీవల తెలుగులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘ఐస్ క్రీమ్' చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











