Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ రికార్డుల జోరు.. పెట్టిన గంటలోపే అమెరికాలో హౌస్ ఫుల్!
సూపర్ స్టార్ మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం పోకిరి సృష్టించిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి దాకా మంచి హీరోగా ఉన్న ఆయనకు తిరుగులేని మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. పూరీ జగన్నాథ్ మహేష్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా సుమారు 16ఏళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించింది. 2006, ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించగా సినిమా దెబ్బకు స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆరోజుల్లోనే 40కోట్ల షేర్ని, 70 కోట్ల గ్రాస్‌ని కలెక్ట్ చేసింది ఈ సినిమా.
ఈ సినిమా విడుదలయ్యేనాటికి అవే హైయ్యేస్ట్ కలెక్షన్లు కావడం విశేషం. ఇక అలాంటి సంచలనాలు సృష్టించిన ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని మళ్లీ థియేటర్లో విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 9న మహేష్‌బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా పోకిరిని వరల్డ్ వైడ్‌గా కొన్ని థియేటర్లలో ప్రత్యేక షోస్ వేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం మరో రికార్డు క్రియేట్ చేసింది.
ఈ మూవీ స్పెషల్ షో టికెట్స్ కోసం మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే కాలిఫోర్నియాలో ఏర్పాటు చేయబోతున్న స్పెషల్ షోకు భారీ స్పందన వస్తోంది. దాని కోసం కేటాయించిన టికెట్లు కేవలం ఒక్క గంటలోనే అమ్ముడయ్యి రికార్డు సృష్టించాయి. ఇక పోకిరి చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది. అక్కడ కూడా ఘన విజయాలు సాధించింది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి ముందుగా మహేష్‌కి బదులు రవితేజని అనుకున్నారు అంటే కాక ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్ కూడా అనుకున్నారట. కానీ రవితేజ్‌తో సెట్ కాలేదు. దీంతో మహేష్ వద్దకి వెళ్లి ఆయన కెరీర్ ను మార్చిన సినిమాగా మారింది.