ఫెయిలయ్యా... లేక పోతే నా రూటే వేరు: పవన్ కళ్యాణ్
హైదరాబాదులోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌తో పోలండ్ రాయబారి ఆడమ్ బురాకోవస్కీ భేటీ అయ్యారు. ఆయనతో పాటు పోలండ్ విద్యార్థులు పవర్ స్టార్ ను కలిశారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో పవన్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
Recommended Video


చదువులో ఫెయిల్ అయ్యా
తాను చదువులో ఫెయిలయ్యాయని, ఒకవేళ బాగా చదువుకుని ఉంటే ప్రొఫెసర్ ని అయ్యేవాడినని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.... విద్యార్థులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

షూటింగులు
పోలాండ్‌తో భారత్‌కు చాలా మంచి అనుబంధం ఉందని పవన్ కళ్యాణ్ ఈ సందర్బంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇండియన్ సినిమాలు పోలండ్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

పవన్ తెలివైన నటుడు
ఈ సందర్భంగా ఆడమ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చాలా తెలివైనవారని, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గొప్ప నటుల్లో పవన్ ఒకరని పొగడ్తలు గుప్పించారు. పవన్ తో మాట్లాడిన సందర్భంగా తాను ఒక విషయాన్ని గుర్తించానని, పవన్ ఒక బ్రిలియంట్ అని, అతని మనస్సులో ఎన్నో మంచి ఐడియాలు ఉన్నాయన్నారు.

భార్య అన్నాతో కలిసి చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రార్థనలు
అంతకుముందు, పవన్ కళ్యాణ్ సికింద్రాబాదులోని సెయింట్ మెరీస్ చర్చిలో ఆదివారం ఉదయం ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం ఏడు గంటలకే ఆయన తన భార్య అన్నాలెజ్‌నేవాతో కలిసి చర్చికి వెళ్లారు.


Click it and Unblock the Notifications