అఖిల్ నీ సినిమా హిట్ అవుతుందీ...!: పోలండ్ బాలుడి ట్వీట్, నాగార్జున రిప్లై
Recommended Video

పోలెండ్ దేశానికి చెందిన జిబిగ్జ్ అనే ఎనిమిదేళ్ల చిన్నారి ఈ మధ్య తెలుగుసినిమా లవర్స్ కి కాస్త పరిచయమే. ఆ మధ్య పాత తెలుగు సినిమా పాటలని పాడుతున్న ఇతని వీడియోలు సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయ్యాయి.ఆ తర్వాత బాహుబలి దండాలయ్య పాటని కూడా పాడిమళ్ళీ కొన్నాళ్ళు యూట్యూబ్, ఫేస్ బుక్ లో కనిపించాడు.

మెరిసే మెరిసే సాంగ్
అయితే ఇంతా చేసి మనోడికి తెలుగు కొంచెం కూడా తెలియదు.. కానీ పాట అన్నా.. నటన అన్నా ప్రాణం. తెలుగు పాటలు కూడా చూస్తుంటాడు. ఇటీవల నాగార్జున రిలీజ్ చేసిన హలో సినిమాలోని మెరిసే మెరిసే సాంగ్ విన్నాడు. వెంటనే దానిని పాడి.. ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

మీ అభినందనలు తెలపండి
"ఈ ట్వీట్ మీరు చూస్తే మీ అభినందనలు తెలపండి" అంటూ ట్వీట్ చేశాడు. అలాగే అఖిల్‌ను ఉద్దేశించి.. ‘‘హలో అఖిల్.. నా పేరు జిబిగ్జ్.. నాది పోలాండ్. మెరిసే మెరిసే పాటలో నీ పెరఫార్మెన్స్ ఎలక్ట్రిఫైయింగ్.. పాట, నీ డ్యాన్స్ అద్భుతంగా ఉంది.

నిన్ను చాలా అభిమానిస్తున్నాను
నేను ష్యూర్‌గా చెప్తున్నా.. నీ ఫిల్మ్ మంచి హిట్ సాధిస్తుంది. అఖిల్ నేను నిన్ను చాలా అభిమానిస్తున్నాను. హలో సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని భావిస్తున్నాను. చీర్స్ అఖిల్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక పాట విషయానికి వస్తే తెలుగు రాకున్నా అద్భుతంగా పాడి విన్న వారందరినీ ఈ చిన్నారి ఆశ్చర్యపరుస్తున్నాడు.

టాలీవుడ్ సినిమాల్లో
ఈ ట్వీట్ చూసిన నాగార్జున అద్భుతంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. మొతానికి జిబిగ్జ్ కొన్నాళ్ళకి టాలీవుడ్ సినిమాల్లో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు...


Click it and Unblock the Notifications











