భార్యను బూతులు తిడుతూ హీరో వీరంగం, అరెస్ట్!
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ సినిమా హీరో భార్యతో గొడవ పడటం చర్చనయాశం అయింది. అది మామూలు గొడవ అయితే పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదేమో కానీ, గొడవ తీవ్రత ఎక్కువగా ఉండటంతో విమాశ్రయంలోని ఇతర ప్రయాణీకులు కంగారుపడ్డారు.
ఆ సినిమా హీరో పేరు ఇంద్రసేన. కుర్ కురే అనే తెలుగు చిత్రంలో హీరోగా నటించాడు. తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తన భార్యను బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు. చుట్టు పక్కల ఇతర ప్రయాణీకులు ఉన్నారనే కనీస ఇంగితం లేకుండా ప్రవర్తించాడు. ఆతర్వాత ఆమెను బలవంతంగా కారులో ఎక్కుకుని బయల్దేరారు. ఇది చూసిన ఇతర ప్రయాణీకులు అతడు ఆమెను కిడ్నాప్ చేస్తున్నాడనుకుని పోలీసులకు సమాచారం అందించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు రాజేంద్ర నగర్ వైపు వెళ్తుండగా అత్తాపూర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో వారిద్దరూ భార్య భర్తలే అని తేలింది. ఇంద్ర సేనకు, అతని భార్యకు ఇది వరకే కొన్ని గొడవలు ఉన్నాయని, ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టులో మళ్లీ గొడవ పడ్డారని పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications











