మాధవీలత అరెస్ట్: అడ్డం తిరుగుతున్న శ్రీరెడ్డి కథ.. అరెస్ట్ చేసినా తగ్గని మాధవీలత!

Recommended Video

Madhavi Latha To Stage Silent Protest Against Sri Reddy

టాలీవుడ్ లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ దారుణాలపై శ్రీరెడ్డి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి సంచలన పోరాటం జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఫిలిం ఛాంబర్ ముందు ఆమె అర్థ నగ్న నిరసనతో ఈ పోరాటం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి పోరాటం గురించి స్పందిస్తూ మీడియా చర్చల్లో పాల్గొంటే న్యాయం జరగదని, పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. పవన్ స్పందనపై కొందరు జూనియర్ ఆర్టిస్టులు మండిపడడం, ఆ తరువాత శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై పరుష పదజాలం ఉపయోగిస్తూ అతిదారుణమైన వ్యాఖ్యలు చేయడంతో తీవ్రమైన వివాదంగా మారింది. పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీరెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేసారు. ఆ యుద్ధంలోకి మరో హీరోయిన్ ప్రత్యక్షంగా దిగబోతోంది.

ఊహించని మలుపు

ఊహించని మలుపు

కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి పోరాటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో ఆమెకు లభించిన మద్దత్తు ఇప్పుడు కరువవుతోంది. శ్రీరెడ్డి వైపుకూడా కొన్ని తప్పిదాలు ఉండడం, ఇటీవల ఆమె పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉండడంతో పవన్ అభిమానులు మద్దత్తు దారులు జీరించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే శ్రీరెడ్డికి కమ్రంగా మద్దత్తు కరువవుతోంది.

మద్దత్తు తెలిపినవారే వ్యతిరేకంగా

మద్దత్తు తెలిపినవారే వ్యతిరేకంగా

ప్రముఖ హీరోయిన్ మాధవీలత ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి మొదట గళం విప్పింది. ఆమె తరచుగా ఇండస్ట్రీ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. శ్రీరెడ్డి పోరాటం మొదలు పెట్టిన తరువాత మాధవీలత కూడా మద్దత్తు ప్రకటించింది. మరో నటి గాయత్రీ గుప్త కూడా శ్రీరెడ్డి పోరాటానికి మద్దత్తు ప్రకటించింది. ఇప్పుడు వారంతా శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మారుతున్నారు.

 పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తున్న మాధవీలత

పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తున్న మాధవీలత

ప్రముఖ నటి మాధవీలత తాను పవన్ కళ్యాణ్ ని అభిమానించే వ్యక్తిని అని గతంలోనే చెప్పుకుంది. సమాజం పట్ల ఆయనకు ఉన్న అంకిత భావాన్ని ఆమె ప్రశంసించింది.

 కొద్దిసేపటికే అరెస్ట్

కొద్దిసేపటికే అరెస్ట్

మాధవీలత దీక్ష ప్రారంభించిన కొద్దీ సేపటికే పోలీస్ లు ఆమెని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దీక్ష విరమించాలని పోలీస్ లు మాధవిలతని కోరగా ఆమె రాత పూర్వకంగానే పోలీస్ లకు తన ఉద్దేశాన్ని తెలియజేసారు. అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. దీనితో ఆమెని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

టాలీవుడ్‌లో హాట్ టాపిక్

టాలీవుడ్‌లో హాట్ టాపిక్

ప్రస్తుతం శ్రీరెడ్డి వ్యవహారం, కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె పోరాటం జాతీయ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ పై అసందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు శ్రీరెడ్డి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకునేలా చేశాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X