»   » మహేష్ బాబు చేత ఓపినింగ్ చేయించుకుని జైలు పాలయ్యారు

మహేష్ బాబు చేత ఓపినింగ్ చేయించుకుని జైలు పాలయ్యారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పంజాగుట్టలో ప్రముఖ జ్యూవెలరీ సంస్థ జాస్ అలుక్కాస్ తన శాఖను పంజగుట్టలో ఆరంభించింది. ఆ సందర్భంగా తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మహేష్ బాబును షాపు ప్రారంభోత్సవానికి పిలిచింది.దాంతో ఎక్కడెక్కడ జనం మహేష్ ని చూడటానకి పోగై పోయారు.పంజాగుట్ట ప్రదేశం మొత్తం వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ అయింది.ఎప్పటిలాగే మహేష్ బాబు ఆలస్యంగా వచ్చారు. ఆ తర్వాత ఒక గంట సేపు షాపులో ఉండి వెళ్లారు. అప్పటివరకు ఎక్కడి ట్రాఫిక్ అక్కడే బంద్.

దాంతో ట్రాఫిక్ పోలీసులకు ఏమి చేయాలో తోచలేదు. చివరికి వారికి మండి, తమకు చెప్పకుండా షాపును ప్రారంభోత్సవం చేయటమేంటని,అలాగే చేసినా మహేష్ బాబును పిలుస్తావా..పిలిచినా ఇంత ట్రాఫిక్ స్తంభనకు కారణం అవుతావా అంటూ విరుచుకుపడ్డారు. అనుమతి లేకుండా ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినందుకుగాను సంస్థ ఎమ్.డి. జాన్ అలుక్కాను, ఇక్కడి స్టోర్ మేనేజర్ గంగాధర్ ను పోలీసులు అరెస్టు చేశారు.ఆ తర్వాత బెయిల్ పై విడుదల చేశారు.అదీ కథ.వ్రస్తుతం మహేష్ దూకుడు చిత్రం చేస్తున్నారు.

English summary
Mahesh Babu opens Jos Alukkas outlet.police arrested two persons of Jos Alukkas, a jewellery showroom holding them responsible for slow down of traffic at Punjagutta.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu