అపార్టుమెంటులో వ్యభిచారం, సినీ నటి అరెస్టు
చెన్నై: వ్యభిచారం చేస్తూ పట్టుబడుతున్న నటీమణులు సంఖ్య ఈ మధ్య ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో నటి పట్టుబడిన సంఘటన వెలుగులోకి వచ్చిది. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన గౌరీ (35) అనే నటిని చెన్నై పోలీసులు వ్యభిచారం కేసులో అరెస్టు చేశారు.
చెన్నై నగరంలో ఓ అపార్టుమెంటు అద్దెకు తీసుకుని ఆమె ఈ వ్యవహారం నడిపిస్తోంది. దీంతో అనుమానం వచ్చిన అపార్టెమెంట్‌లోని ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గౌరీ ఉంటున్న అపార్టుమెంటుపై మెరుపు దాడి చేసిన పోలీసులు ఆమెతో పాటు విటులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హజరు పరిచారు.

ఇటీవల హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని స్టార్ హోటల్ దసపల్లాలో కూడా బెంగాలీ బుల్లితెర నటి సుకన్య ఛటర్జీ వ్యభిచారం కేసులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారం అందుకుని ఆమెను అరెస్టు చేసారు. ఈ సంఘటనలో ఆమెతో పాటు ఇద్దరు విటులను అరెస్టు చేసారు.
సినిమా తారలు వ్యభాచారం బాట పట్టడానికి వారు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడటం, అవకాశాలు లేక పోవడమే అని విశ్లేషకులు అంటున్నారు. అవకాశాలు ఉన్నప్పుడు డబ్బు సంపాదిస్తూ విలాసాలకు అలవాటు పడిన తారలు...అవకాశాలు లేని సమయంలో డబ్బు సంపాదనకు వ్యభిచారం ఊబిలోకి దిగుతున్నారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











