నాగార్జున కేసులో విచారణ ప్రారంభం
సినీ నటుడు నాగార్జున బెదిరింపులకు పాల్పడిన కేసులో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు నాగార్జునతో పాటు, అన్నపూర్ణ స్టూడియోస్‌లో పని చేసే వారిని, నాగార్జున బెదిరింపులకు పాల్పడిన సమయంలో ఉన్న పాత్రికేయుల దగ్గర నుంచి జూబ్లీ హిల్స్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో నాగార్జున నేరం రుజువైతే శిక్ష తప్పదంటున్నారు న్యాయ నిపుణులు.
తనను సినీనటుడు నాగార్జున అసభ్య పదజాలంతో దూషించడని, బెదిరింపులకు పాల్పడ్డాడని ఓ ఆంగ్ల పత్రిక విలేకరి వై.సునీత చౌదరిపై ఇటీవల నాగర్జునపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నాగ్‌పై ఐపిసి 506, 509 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.
నాగార్జున విగ్గుపెట్టుకుని సినిమాల్లో నటిస్తున్నారంటూ...సునీత చౌదరి గతంలో రాసిన ఓ ఆర్టికల్ ను మనసులో పెట్టుకున్న నాగార్జున ఇటీవల అన్నపూర్ణ స్టూడియోకు ప్రెస్ మీట్ కు వచ్చిన సునీత చౌదరిపై తన ప్రతాపం చూపాడని, బూతులు తిడుతూ దూషించాడని, బెదిరించాడని, అందుకే ఆమె నాగార్జునపై పోలీసులకు పిర్యాదు చేసిందని చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











