డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ప్రిన్స్.. కేసు నమోదు.. ఎవ్వరూ గుర్తు పట్టకుండా!
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సమాజంలో మందుబాబుల ఆగడాలు ఆగేలా లేవు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అది తమతో పాటు ఇతరులకు కూడా అత్యంత ప్రమాదకరమని పేర్కొంటూ ఎన్నో అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం ఉండటం లేదు. నిత్యం ఎంతోమంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పోలీసుల చేతికి చిక్కుతున్నారు. ఇందులో కొందరు సెలెబ్రిటీలు కూడా ఉండటం షాకిస్తోంది.

ప్రజలకు అవగాహన కల్పించే నటీనటులే ఇలా
ప్రతీ సినిమా థియేటర్‌లో మద్యపానం - ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రజలకు అవగాహన కల్పించే నటీనటులే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోతుండటం వారి విజ్ఞత ఏంటో తెలుపుతోంది. ఇప్పటికే ఎందరో నటీనటులు, సెలెబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికి పోగా తాజాగా నటుడు, బిగ్ బాస్ కంటిస్టెంట్ ప్రిన్స్ మద్యం సేవించి వాహనం నడుపుతూ అడ్డంగా బుక్కయ్యాడు.

దొరికిపోయిన ప్రిన్స్.. కేసు నమోదు
నిన్న (సోమవారం) రాత్రి హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయాడు ప్రిన్స్. దీంతో వెంటనే పోలీసులు ప్రిన్స్ కారుని సీజ్ చేసి.. అతనిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నేడు (మంగళవారం) ఉదయం కూకట్‌పల్లి కోర్టుకి హాజరయ్యాడు ప్రిన్స్.

కోర్టు ఎదుట ప్రిన్స్.. ఎవ్వరూ గుర్తు పట్టకుండా కవర్
ఈ రోజు కూకట్‌పల్లి కోర్టుకి హాజరైన ఈ నటుడు.. తనను ఎవ్వరూ గుర్తు పట్టకుండా జాగ్రత్త పడుతూ మొహాన్ని కవర్ చేసుకున్నాడు. కానీ మీడియా, కెమెరా కళ్లు అతన్ని పట్టేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నలుగురికి మెలకువ చెప్పాల్సిన సెలెబ్రిటీలే ఇలా మధ్య సేవించి వాహనాలు నడపడం దారుణమని అంటున్నారు జనం.
Recommended Video

ప్రిన్స్ జర్నీ.. బిగ్ బాస్ షో
తేజ దర్శకత్వంలో వచ్చిన `నీకు నాకు డాష్ డాష్` సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ప్రిన్స్. ఆ తర్వాత 'బస్ స్టాప్', 'నేను శైలజ' లాంటి సినిమాల్లో నటించాడు. బిగ్ బాస్ సీజన్ వన్‌లో కంటిస్టెంట్‌గా పాల్గొన్న ప్రిన్స్.. 57వ రోజున ఆ షో నుంచి ఎలిమినేట్ చేయబడ్డాడు.


Click it and Unblock the Notifications











