విజయ్ దేవరకొండపై ఆదివాసీల కేసు.. ఎందుకు? ఏమైంది?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన రాబోయే చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. 'ఖుషి' చిత్రంతో కంబ్యాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ నెక్ట్స్ తన రాబోయే సినిమాలతో భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. కెరియర్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. మరోవైపు పలు విషయాల్లోనూ విజయ్ దేవరకొండ పేరు వివాదాస్పందంగా మారుతోంది. తాజాగా విజయ్ దేవరకొండపై కేసు నమోదవడం అందరినీ షాక్ కు గురిచేసింది.

రెట్రో మూవీ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ స్పీచ్..
తమిళ స్టార్ హీరో సూర్య - పూజా హెగ్దే జంటగా తాజా చిత్రం 'రెట్రో'. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే1న తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. రిలీజ్ కు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ ను టీమ్ గట్టిగా నిర్వహించారు. ఈక్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరయ్యారు. తన స్టైలిష్ లుక్, స్పీచ్ తో ఆకట్టుకున్నారు. సూర్యపై తన అభిమాన్ని, కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిని విజయ్ దేవరకొండ గుర్తు చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఆదివాసీల గురించి మాట్లాడారు.

Police case against Vijay Deverakonda

విజయ్ మాటలకు ఆదివాసీలు ఫైర్..
పాకిస్థాన్ ఇండియాపై అనవసరంగా కాలు దువ్వుతోంది. వాళ్లు చేసేదేమీ ఉండదు. అక్కడి సివిలియన్సే ఆ గవర్నమెంట్ పై తిరగబడతారు. అస్సలు 500 ఏళ్ల ఆదివాసీల లాగా కొట్టుకోవడం బుద్ధి లేని పని అన్నారు. కాస్తా కూడా కామన్ సెన్స్ లేకుండా పాక్తిస్థాన్ వాళ్లు ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే విజయ్ దేవరకొండ పాకిస్తాన్ చర్యలను ఆడియెన్స్ కు వివరించే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా ఆదివాసీల పెద్దలు తమను విజయ్ దేవరకొండ కించ పరిచేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

విజయ్ దేవరకొండపై కేసు నమోదు..
పింక్ విల్లా అందించిన రిపోర్ట్ ప్రకారం..లాయర్ కిషన్ లాల్ చౌహాన్ విజయ్ దేవరకొండ మీద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండపై కేసు పెట్టారు. ప్రస్తుతం హాట్ టాపిక్ గ్గా ఉన్న సామాజిక్ రాజకీయ పరిస్థితులను ఆదివాసీలతో పోల్చడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ ఇంకా దీనిపై విజయ్ దేవరకొండ నుంచి ఎలాంటి స్పందన లేదు.

విజయ్ దేవరకొండ రాబోయే సినిమాలు..
చివరిగా విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో నెక్ట్స్ రాబోయే చిత్రాలపై విజయ్ దేవరకొండ ఫుల్ ఫోకస్ పెట్టారు. మే30న విజయ్ దేవరకొండ నటించిన యాక్షన్ డ్రామా 'కింగ్ డమ్' చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ భోర్స్లే హీరోయిన్ గా నటించింది. ఇక విజయ్ దేవరకొండ పాకిస్తాన్, ఫహల్గాం ఎటాక్, కాశ్మీర్ పై మాట్లాడిన డేరింగ్ మాటలకు నెటిజన్ల నుంచి ప్రశంసలు కూడా కురుస్తుండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X