సినీ నటిపై బాలీవుడ్ నిర్మాత కేసు.. పబ్‌లో మద్యం సేవించి అలా చేసిందంటూ!
ఈ మధ్యకాలంలో సినీ నటుల మధ్య వివాదాలు, పబ్‌లో గొడవలు తరచూ చూస్తూనే ఉన్నాం. కారణాలేవైనప్పటికీ ఈ గొడవలు పోలీసుల దాకా వెళ్లడం, కేసులు ఫైల్ కావడం లాంటి పరిణామాలు ఎక్కువయ్యాయి. తాజాగా ఇలాంటి ఓ సంఘటన బెంగళూరులో జరిగింది. ఓ బాలీవుడ్ నిర్మాత, సినీ నటిపై కేసు ఫైల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు చూద్దామా..

తాగిన మైకంలో దాడి.. విస్కీ బాటిల్ తీసుకొని
విస్కీ బాటిల్, గ్లాస్ తీసుకుని తన ముఖం మీద సంజనా దాడి చేసిందని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ బెంగళూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాగిన మైకంలో బెంగళూరు నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ ఇద్దరి మధ్య గొడవ రాజుకొని, చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. దీంతో ఈ ఇష్యూ వార్తల్లో నిలిచింది.

బాలీవుడ్ నిర్మాత వందనా
బెంగళూరుకు చెందిన వందనా జైన్ బాలీవుడ్ సినిమాల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటున్న ఆమె పలు పార్టీలకు, శుభకార్యాలకు వచ్చి వెళుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఓ పబ్‌లో జరిగిన పార్టీలో నటి సంజనకు, ఆమెకు మధ్య వివాదం చెలరేగి రచ్చ రచ్చ అయింది.

పబ్‌లో పార్టీ.. సినీ సెలబ్రిటీలు
బెంగళూరు నగరంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లోని కూంఝీ బార్ (పబ్)లో క్రిస్మస్ పండుగ సందర్బంగా డిసెంబర్ 24వ తేదీ రాత్రి మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ మందు పార్టీకి ప్రముఖ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ నిర్మాత వందనా జైన్, స్యాండిల్ వుడ్ ప్రముఖ నటి సంజనా సైతం హాజరయ్యారు.

ఒకే టేబుల్‌పై మద్యం సేవించి..
ఈ పార్టీలో వందనా జైన్, సంజనా ఒకే టేబుల్ పై మద్యం సేవించారని తెలిసింది. అయితే చిన్న విషయంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం మొదలై చివరకు పెద్ద రచ్చగా మారిందని అక్కడున్న వారు అంటున్నారు. మద్యం మత్తులో ఉన్న నటి సంజనా ఆమె చేతిలో విస్కీ గ్లాస్, విస్కీ బాటిల్ తీసుని వందనా జైన్ ముఖం మీద దాడి చేసిందని సమాచారం.

బెంగళూరు డీసీపీ చెప్పడంతో..
కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ స్యాండిల్ వుడ్ నటి సంజనా మీద ఫిర్యాదు చేశారని, కేసు విచారణలో ఉందని బెంగళూరు డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ అన్నారని ప్రముఖ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అయితే తన తల్లిని వందనా జైన్ దూషించడం కారణంగానే తాను దాడి చేశానని నటి సంజన అంటోందని తెలిసింది.


Click it and Unblock the Notifications











