వారూ వ్యభిచారులే, వల్గర్‌గా మాట్లాడిన డైరెక్టర్, చివరకు కేసు...

By Bojja Kumar

ఈ మధ్య కాలంలో వివాదాస్పద కామెంట్స్ చేసి పబ్లిసిటీ పెంచుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది. ఒకరిని చూసి మరొకరు పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నారు. మరి ఇలాంటి ప్రయత్నమో? లేక సెన్సేషన్ కోసం చేశాడో తెలియదు కానీ ఓ దర్శకుడు చేసిన వల్గర్ కామెంట్స్ చివరకు అతడిపై కేసు నమోదుకు దారి తీసింది. అతడి మాటలు విన్న చాలా మంది అసహ్యించుకుంటున్నారు. మహిళల పట్ల నీచమైన కామెంట్లు చేస్తున్నాడంటూ అంతా ఛీ కొడుతున్నారు. ఆ దర్శకుడి పేరు అజయ్ కౌండిన్య.

Recommended Video

తలసాని, రోజా, పవన్‌పై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్....!

 భూత్ బంగ్లా డైరెక్టర్

భూత్ బంగ్లా డైరెక్టర్

NH4లో భూత్ బంగ్లా అనే చిత్రానికి అజయ్ కౌండిన్య దర్శకత్వం వహించారు. జనవరి 26న ఫిల్మ్ ఛాంబర్ లో 'భూత్‌ బంగ్లా' సినిమా ప్రమోషన్ నిర్వహించిన ఇతగాడు మహిళల పట్ల దారుణమైన కామెంట్లు చేశాడు.

 వారూ వ్యభిచారులే

వారూ వ్యభిచారులే

వివిధ ప్రాంతాల నుంచి చదువుకునేందుకు హైదరాబాదులోని అమీర్ పేటకు వచ్చిన అమ్మాయిలు, కొందరు పోలీస్ బాస్ లు వ్యభిచారులేనంటూ.... అజయ్ కౌండిన్య దారుణమైన కామెంట్స్ చేశారు.

 కేసు నమోదు

కేసు నమోదు

దీంతో అజయ్ కౌండిన్యపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అతడు చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఈ మేరకు మల్కాజ్‌ గిరి వసంతపురి కాలనీకి చెందిన శ్రీ లలితా, మహిళా మండలి సమితి అధ్యక్షురాలు జిన్నెల సురేఖ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

 టీవీ ఛానల్ డిబేట్‌లోనూ వితండవాదం

టీవీ ఛానల్ డిబేట్‌లోనూ వితండవాదం

ఈ నెల 30న ఒక టీవీ ఛానెల్ డిబేట్ కూడా తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటూ అజయ్ కౌండిన్య వింతడవాదం చేశారు. దీంతో మహిళలను కించ పరిచే విధంగా మాట్లాడుతున్న అతడి పక్కన కూర్చోవడం ఇష్టం లేక ఓ కాలేజీ విద్యార్థిని చర్చ నుండి అర్దాంతరంగా లేచి వెళ్లిపోయింది.

 గాయిత్రి గుప్తా గురించి దారుణంగా...

గాయిత్రి గుప్తా గురించి దారుణంగా...

‘భూత్ బంగ్లా' ప్రెస్ మీట్లో అజయ్ కౌండిన్య నటి గాయిత్రి గుప్తా గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాయిత్రి గుప్తా ఆడా మగా తేడా తెలియని మాడా అమ్మాయి. మొన్న గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ సినిమా గురించి ఇంటర్వ్యూలో మాట్లాడింది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అమ్మాయిలను వాడేసుకుంటారని అంటోంది. ఆ అమ్మాయి ఆడా? మగా? తేడా అయితే నాకు తెలియడం లేదు. అలాంటి వ్యక్తికి డైరెక్టర్ల గురించి మాట్లాడే అర్హత లేదు.... అంటూ అజయ్ కౌండిన్య వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

 పడుకుంటేనే అవకాశాలు

పడుకుంటేనే అవకాశాలు

సినిమా పీల్డు గురించి ఓపెన్ టాక్ చెబుతున్నాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామెన్ ఇలా అందరి దగ్గర పడుకుంటేనే హీరోయిన్లకు, లేడీ ఆర్టిస్టులకు క్యారెక్టర్ ఉంటుంది, దీన్ని నేను ప్రూవ్ చేస్తాను.. ఇవన్నీ తెలిసి కూడా గాయిత్రి గుప్తా డైరెక్టర్ల గురించి మాట్లాడటం ఏమిటి?.... అంటూ అజయ్ కౌండిన్య వివాదాస్పద కామెంట్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X