భీష్మ మూవీపై పోలీస్ కేసు: ఓ వైపు వసూళ్ల ప్రవాహం మరోవైపు చిక్కులు..
నితిన్ తాజా సినిమా భీష్మ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా అన్ని సెంటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తున్న ఈ తరుణంలో భీష్మ మూవీపై పోలీస్ కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ భీష్మకు వచ్చిన చిక్కులేంటి? ఈ సమయంలో పోలీస్ కేసు ఎందుకు నమోదైంది? వివరాల్లోకి పోతే..
Recommended Video


అంచనాలను అందుకున్న భీష్మ..
వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ చిత్రంలో నితిన్ హీరోగా నటించగా, ఆయన సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. విడుదలకు ముందే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆసక్తి రేకెత్తించడమే గాక, విడుదలయ్యాక అంచనాలను అందుకుంది భీష్మ మూవీ.

ఇది అవమానకరం.. పోలీస్ కేసు
ఈ పరిస్థితుల్లో భీష్మ అనే టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ గంగపుత్ర సంక్షేమ సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాలోని డైలాగులు, చిత్ర టైటిల్ తమ మనోభావాలు దెబ్బతినేలా, తమను అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ మలక్‌పేట పోలీసులకు సంఘం అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు.

వెంటనే చర్యలు తీసుకోవాల్సిందే..
భీష్మ సినిమాలో హీరో అమ్మాయిల వెంటపడే లవర్ బాయ్ అలాంటి క్యారెక్టర్‌కు భీష్మాచార్యుడి పేరు ఎలాపెడతారని సంఘం ప్రతినిధులు ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాపై వెంటనే చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు నితిన్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, వెంకీ కుడుముల, చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసుల రెస్పాన్స్..
అయితే తెలంగాణ గంగపుత్ర సంక్షేమ సంఘం ఫిర్యాదుపై మలక్‌పేట పోలీసులు స్పందించారు. భీష్మ సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయిత తదితరులపై ఫిర్యాదు అందిందని, ఈ ఫిర్యాదుపై తగిన దర్యాప్తు చేపట్టి.. అనంతరం చర్యలు తీసుకుంటామని అన్నారు.

విడుదలకు ముందు కూడా ఇలాగే..
విడుదలకు ముందు కూడా ఇలాగే భీష్మ పై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బీజేపీ ధార్మిక సెల్ రంగంలోకి దిగి.. మహాభారతంలో భీష్ముడి పేరుని ఈ సినిమాకు టైటిల్‌గా వాడటం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని ఆవేదనను వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











