‘కోయిలమ్మ’ సీరియల్ హీరోపై వేధింపుల కేసు: ప్రియురాలి ప్రమేయం ఉండడం వల్లే.. ఘటనలో కొత్త ట్విస్ట్!
తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను అందుకుంటాయి. అలాంటి వాటిలో ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన 'కోయిలమ్మ' ఒకటి. 2019లో ప్రారంభం అయిన ఈ సీరియల్ చాలా కాలం పాటు తెలుగు బుల్లితెరపై హవాను చూపించింది. ఈ సీరియల్‌లో సెకెండ్ హీరోగా నటించాడు అమర్ శశాంక్ అలియాస్ సమీర్. అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న అతడిపై తాజాగా వేధింపుల కేసు నమోదైంది. ఇద్దరు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్లే ఈ పరిస్థితి ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే...

హీరో అమర్‌పై కేసు నమోదు
'కోయిలమ్మ' సీరియల్‌లో సెకెండ్ లీడ్‌గా చేసిన అమర్ శశాంక్ (సీరియల్‌లో సమీర్)పై మణికొండకు చెందిన ఇద్దరు యువతులు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత రాత్రి తాగిన మైకంలో తమ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశాడని, అసభ్య పదజాలంతో దూషించాడని పేర్కొంటూ వాళ్లు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో పోలీసులు అమర్‌పై కేసు నమోదు చేసుకున్నారు.

అప్పు కూడా చెల్లించడంలేదని
బాధిత యువతులు ఇచ్చిన ఫిర్యాదులో పలు ఆసక్తికర విషయాలను సైతం వెల్లడించారు. అమర్‌కు తాము రూ. 5 లక్షలు అప్పుగా ఇచ్చామని, అవి తిరిగి చెల్లించమని అడిగినందుకే తమపై దౌర్జన్యం చేశాడని అందులో పేర్కొన్నారు. అతడితో పాటు మరో నలుగురు వ్యక్తులు దాడికి దిగినట్లు చెప్పారు. అంతేకాదు, అతడి నుంచి తమకు ప్రాణహాని కూడా ఉన్నట్లు ఆరోపిస్తున్నారు.

ఇంటర్నెట్‌లో వీడియో వైరల్
అమర్ శశాంక్ తమపై దాడికి దిగినట్లు చెబుతోన్న ఇద్దరు యువతులు అందుకు తగిన వీడియో ఆధారాలను సైతం పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఆ వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో ఓ యువతి అమర్‌తో గొడవ పడుతోంది. ఆ తర్వాత అతడు కూడా ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవలో చాలా మంది భాగమైనట్లు తెలుస్తోంది.

దౌర్జన్యం కేసులో కొత్త ట్విస్ట్
అమర్ శశాంక్ కేసులో ఓ కొత్త న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ గొడవకు కారణం అతడి ప్రియురాలే అని తెలుస్తోంది. బాధితులుగా ఉన్న ఇద్దరు యువతులతో పాటు అమర్ ప్రేయసి.. మణికొండలో ఓ బొటీక్ నడుపుతున్నట్లు తెలిసింది. అక్కడ వాళ్ల మధ్య వ్యాపారపరమైన లావాదేవీల విషయంలో తేడాలు రావడం వల్లే ఈ గొడవ మొదలైనట్లు సమాచారం.
Recommended Video

ప్రియురాలి వల్లే గొడవకు దిగి
ముగ్గురు యువతుల మధ్య వ్యాపార లావాదేవీలు జరుగుతోన్న సమయంలోనే అమర్ శశాంక్ కలుగజేసుకున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సందర్భంగానే మిగిలిన ఇద్దరు అమ్మాయిలతో అతడు సెటిల్‌మెంట్ కోసం ప్రయత్నించాడని.. దానికి ఒప్పుకోకపోవడం వల్లే గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారం బయటకు రావడంతో పోలీసులకు వెళ్లిందని టాక్.


Click it and Unblock the Notifications











