బ్రేకింగ్: రామ్ గోపాల్ వర్మ పై పోలీస్ కేసు.. వెంటనే రద్దు చేయాలని డిమాండ్
సంచలనాలకు కేంద్రబిందువు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టించిన ఆయన.. ఈ సారి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ గొడ్డలి పెట్టుకు రెడీ అయ్యాడు. ఏ మాత్రం కాంట్రవర్సీ లేదంటూనే ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో తాజాగా రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. మరోసారి వివాదాస్పదంగా మారింది 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా. అనంతపురం లోని కొందరు కాంగ్రెస్ నేతలు.. వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా కులాల మధ్య గొడవలు సృష్టించేదిగా ఉందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా టైటిల్ వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌లో ప్రతీ ఒక్కరినీ టార్గెట్ చేస్తూ తనదైన కోణంలో సన్నివేశాలు చూపించాడు వర్మ. మొత్తానికి ఈ సినిమా నుంచి విడుదలవుతున్న అప్‌డేట్స్ చూస్తుంటే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తుండగా.. వర్మ సహ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. చూడాలి మరి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా మున్ముందు ఇంకెలాంటి సంచలనాలు సృష్టించనుందో!.


Click it and Unblock the Notifications











