హీరో రాజ్ తరుణ్ నన్ను వాడుకున్నాడు.. ఆ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడు: కేసు పెట్టిన యువతి

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రం హిట్లు అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో రాజ్ తరుణ్ ఒకడు. చాలా రోజుల క్రితమే ఇండస్ట్రీలోకి ఎంటరైన ఈ కుర్రాడు.. ఆ తర్వాత ఎన్నో కాంట్రవర్శీల్లో చిక్కుకుని ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడిప్పుడే కెరీర్ గాడిన పడుతుంది అనుకుంటోన్న సమయంలో రాజ్ తరుణ్ మరో కేసులో చిక్కుకున్నాడు. అసలేమైంది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

హీరో రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న యంగ్ హీరో రాజ్ తరుణ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోన్న అతడిపై లావణ్య అనే ఓ యువతి హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సదరు యువతి రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించడం సంచలనం అవుతోంది.

Police Case Filed on Tollywood Young Hero Raj Tarun

సంచలన విషయాలు చెప్పి
యంగ్ హీరో రాజ్ తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్య ఎన్నో సంచలన విషయాలను తన స్టేట్‌మెంట్‌లో రాసుకుంది. అందులో ఆమె అతడిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. సదరు యువతి నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీ కూడా ఇప్పటికే బయటకు వచ్చింది. అలాగే, ఆ అమ్మాయి, రాజ్ తరుణ్‌తో కలిసి దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

11ఏళ్లు రిలేషన్.. గుడిలో పెళ్లి
లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో '11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. గతంలోనే మేమిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. కానీ, తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్‌తో అఫైర్‌ పెట్టుకొని ఇప్పుడు రాజ్ తరుణ్ నన్ను వదిలేశాడు. అంతేకాదు, అతడు మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి నాకు దూరంగా ఉంటున్నాడు' అని పేర్కొంది.

Police Case Filed on Tollywood Young Hero Raj Tarun

చంపేస్తానని బెదిరింపులు
ఇదే పిటీషన్‌లో లావణ్య 'రాజ్ తరుణ్‌ను వదిలేయకపోతే నన్ను చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని కొంత మంది బెదిరిస్తున్నారు. గతంలో కూడా నన్ను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారు. అప్పుడు నేను అరెస్టై 45 రోజులు పాటు జైల్లో ఉన్నాను. కానీ, ఆ పరిస్థితుల్లో కూడా రాజ్‌ నాకు ఎలాంటి సాయం చేయలేదు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Police Case Filed on Tollywood Young Hero Raj Tarun

రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం
రాజ్ తరుణ్ ప్రేయసిగా పేర్కొంటోన్న లావణ్య తన ఫిర్యాదులో 'రాజ్ తరుణ్ నన్ను ప్రేమించానని నమ్మించాడు. అందుకే శరీరకంగా వాడుకున్నాడు. కానీ, ఇప్పుడు మాత్రం వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. రాజ్‌ తరుణ్‌ నా ప్రపంచం.. తను నాకు కావాలి' అంటూ రాసుకొచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం సెన్సేషన్ అయిపోయింది.

More from Filmibeat

Read more about: raj tarun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X