twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు దర్శకుడు వేధింపులు..హీరోయిన్ కంప్లైంట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : కళ్లు తడవకుండా జీవితాన్ని, పెదవి తడవకుండా ప్రేమని దాటలేం అంటూ కొటేషన్స్ రాసి తన సినిమాని తీసుకువస్తున్న దర్శకుడు నిజ జీవితంలోనూ దాన్ని తనకే వర్తింపుచేసుకోవాలని చూసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తనని దర్శకుడు వేధిస్తున్నాడని హీరోయిన్ సోనాలి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ చేసారు. ఆ దర్శకుడు పేరు విఎస్ ఫణి. ఈ మధ్యనే ఆయన 24 బై లవ్ అనే చిత్రం రూపొందించి, ఆడియో ఫంక్షన్ సైతం ఘనంగా చేసారు. గతంలో పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ఫణికి ఈ సినిమా తొలి ప్రయత్నం. ఈ చిత్రంలో చందు,సోనాలి, అలేఖ్య హీరో,హీరోయిన్స్ గా నటించారు.

    చిత్రం గురించి...

    24గంటలు ప్రేమిస్తూ జీవితాన్ని గడిపితే ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే 24/లవ్ చిత్రాన్ని చూడాల్సిందే అన్నారు చిత్ర దర్శకుడు వి.ఎస్.ఫణి. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసిన ఆయన తొలిప్రయత్నంగా 24/లవ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చందు, సోనాలి, అలేఖ్య ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రంగనాధమ్ ఫిలిమ్స్ పతాకంపై సిరికొండ రంగనాధమ్ నిర్మిస్తున్నారు. శ్రీవెంకట్ సంగీతాన్నందించిన చిత్ర గీతాలు రీసెంట్ గా హైదరాబాద్‌లో విడుదలయ్యాయి.

    Police case on 24/love director

    దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ నవ్యమైన కథతో తెరకెక్కిన చిత్రమిది. చక్కటి బాణీలతో పాటలు కుదిరాయి. సినిమాను ప్రాణంగా ప్రేమించే యువబందంతో ఈ సినిమాను రూపొందించాం అన్నారు. ఈ చిత్రం ద్వారా సంపాదించే ప్రతి రుపాయిని అనాథాశ్రమానికి, వద్ధాశ్రమాలకు పంచుతామని నిర్మాత తెలిపారు. కథానుగుణంగా శ్రావ్యమైన బాణీలతో పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు చెప్పారు.

    English summary
    New heroine Sonali gave a Police Compliant on 24/Love director at Hyderbad Police Station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X