పెళ్లి పేరుతో మోసం: దర్శకుడిపై కేసు
హైదరాబాద్: ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతన్ని నమ్మిత యువతి ఆ సినీ దర్శకుడి మాయలో పడి పోయింది. చివరకు అతడు తనను మోసం చేసాడని గ్రహించింది. తనకు న్యాయం కావాలంటూ పోలీసులను ఆశ్రయించింది. అతనెవరో కాదు...సినీ దర్శకుడు సురేష్ కృష్ణ. 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' చిత్రానికి దర్శకత్వం వహించాడు.
దర్శకుడు సురేష్ కృష్ణ తనను ప్రేమించి మోసం చేసాడని ఆరోపిస్తూ మల్లిక అనే యువతి ఐదు రోజుల క్రితం హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ కొందరు గుండాలు మల్లికను పోలీస్ స్టేషన్ ఎదుటే బెదిరింపులకు దిగడం చర్చనీయాంశం అయింది. సురేష్ కృష్ణ వల్ల తనకు ప్రాణభయ ఉందని మల్లిక ఆందోళన చెందుతోంది.
సినీ రంగంలో ఇలాంటి వ్యవహారాలు ఈ మధ్య చాలానే చోటు చేసుకుంటున్నాయి. కొందరు దర్శకులు హీరోయిన్ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతులకు గాళం వేసి తమ సినిమాల్లో అవకాశం ఇస్తామని లొంగదీసుకోవడం పరిపాటి అయిపోయింది. ఈ విషయమై చాలా టాప్ హీరోయిన్లు సైతం బహిరంగ కామెంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అంతెందుకు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మాధుర్ బండార్క్ లాంటి వారిపై కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చాలా మంది దర్శకులపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. బయట పడితే తమ పరువే పోతుందని చాలా మంది ఇలాంటి విషయాలను బయటకు చెప్పడం లేదు.


Click it and Unblock the Notifications











