జూ ఎన్టీఆర్ 'బృందావనం' చిత్రంపై పోలీస్ కేసు
దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందన "బృందావనం" చిత్రంపై తాజాగా ఓ పోలీస్ కేసు నమోదు అయ్యింది. హైదరాబాద్ శివార్లు లోని బాలా నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు చేసారు. ఇంతకీ కేసు ఎందునిమిత్తం అంటే ఈ చిత్రంలో కృష్ణుడుని కించపరిచేలా చూపేరని, తమ మనో భావాలు దెబ్బ తీసేలా చేస్తున్నారని. ఇక ఈ కేసుని ఓ న్యాయవాది వేసారని తెలుస్తోంది. అయితే సినిమా రిలీజ్ కాకముందే సినిమాలో కృష్ణుడుని ఎలా చూపారో తెలియకుండానే మనో భావాలను దెబ్బ తీయటం ఎలా జరగుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ గత చిత్రం అదుర్స్ అప్పుడు కూడా ఓ తెలంగాణ రచయిత తన కథను తస్కరించారంటూ వివాదం జరిగింది. మరో ప్రక్క లేటెస్ట్ రిలీజ్ రోబో విషయంలోనూ విజయార్కే అనే రచయిత..ఆ చిత్రం విడుదల కాకముందే..ఆ కథ నాదేనంటూ క్రెడిట్ ఇవ్వాలని టీవీ ఛానెల్స్ కి ఎక్కిన సంగతి తెలిసిందే. మహేష్ ఖలేజా సైతం ఇప్పుడు టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఇక బృందావనం చిత్రం అక్టోబర్ 14న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











