రెచ్చగొట్టారంటూ మోహన్‌బాబుపై కేసు
ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబుపై హైదరాబాద్ నగరంలోని ఎల్‌బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ప్రాంతీయ విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినట్టు ఈ నెల 23న తెలంగాణ న్యాయవాదుల సంఘం సభ్యుడు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహా తీసుకున్న ఎల్‌బీ నగర్ పోలీసులు శనివారం మోహన్‌బాబుపై 153ఏ, 504, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ చిత్రం షూటింగ్ కొంపల్లిలో జరుగుతున్నప్పుడు తెలంగాణా ఆందోళన కారులు దాడి చేసారు. ఆ సందర్భంగా మోహన్ బాబు కేసీఆర్ ని ఉద్దేశిస్తూ ఆయన నివాశం వద్ద మాట్లాడారు.
మోహన్ బాబు మనోజ్ తెలంగాణ కేసీఆర్ గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ కేసు కొంపల్లి లక్ష్మీ ప్రసన్న mohanbabu manoj telangana kcr police case kompalli laxmi prasanna


Click it and Unblock the Notifications