twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేశ్‌ బాబు వెహికల్ కు పోలీసుల ఫైన్

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : మహేశ్‌బాబు బస్సు(కారవాన్) కు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చలానా రాశారు. షూటింగ్‌ల కోసం ఉపయోగించే సౌకర్యాలున్న ఈ బస్సు అద్దాలకు నల్లపొర ఉండటంతో రూ.1000 జరిమానా విధించారు.బస్సు రిజిస్ట్రేషన్‌ మహేశ్‌ బాబు పేరుతోనే ఉందని ఇన్‌స్పెక్టర్‌ జావీద్‌ పేర్కొన్నారు. AP23AG4005 నెంబర్ గల ఈ బస్సు...ఫిల్మ్ నగర్ నుంచి నానక్ రామ్ గూడా.. వెళ్తూండగా షేక్ పేట నల్లా దగ్గర టోలీచౌక్ పౌలీసులు పట్టుకున్్నారు. ఇది మహేష్ కి చెందిన వెహికల్ అని డ్రైవర్ చెప్పినా..వారు వదలకుండా ఫైన్ రాసారు. ఈలోగా కొందరు పోలీసులు లోపల చెక్ చేసి,అక్కడున్న అద్బుతమైన సౌకర్యాలు చూసి షాకయ్యారు.

    ఇక ప్రస్తుంత మహేష్...సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం విజయవంతం కావటంతో ఆ ఉత్సాహంలో ఉన్నారు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. క్రితి సానన్ హీరోయిన్. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

    ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అందిన ఆసక్తికర సమాచారం ఏమిటంటే....బాలీవుడ్ మూవీ 'ఏక్ థా టైగర్'కు అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కాన్రాడ్ పాల్మిశానో 'మహేష్ బాబు-సుకుమార్' సినిమాకు పని చేయబోతున్నారు. ఈ విషయాన్ని పిఆర్‌ఓ బిఎ రాజు తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫైట్స్ చిత్రీకరిస్తున్నారని ఆయన చెప్పారు.

    ఇతర వివరాల్లోకి వెళితే...సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు కొత్త లుక్ తో చూపెట్టనున్నారు.

    English summary
    Hyderabad Traffic police has issued a challan to a bus (AP23AG4005) belongs to Hero Prince Mahesh Babu for having tinted film glasses on the bus which is prohibition has per traffic police. The bus was going from Film Nagar to Nanakramguda via Sheik pet Nala was stopped by Tolichowk traffic police and questioned the driver whether he did not know that glasses with tinted film is prohibited, then the driver told the police that the bus belongs to Mahesh Babu. However Inspector Javid has made a challan of Rs.1000 and was handed over to driver, meanwhile the police personnel who were present at the spot checked the bus inside but were shocked to see inner area because it was like a heaven with all the facilities.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X