Allu Arjun: అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్.. అసలేం జరిగిందంటే?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్- సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప 2' సినిమా రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. భారీ బడ్డెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ హీరో అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్లను తన భుజాన వేసుకొని ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో అల్లు అర్జున్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. సినిమా విడుదల వేళ బన్నీకే కాకుండా మూవీ యూనిట్స్ కూడా షాక్ తగిలింది. అసలేం జరిగిందంటే..
మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప2 సినిమా ప్రమోషన్స్ లో హీరో అల్లు అర్జున్ తో పాటు మూవీ యూనిట్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ ప్రమోషన్స్ ఈవెంట్స్ కు ఊహించిన విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ హాజరవుతున్నారు. బీహార్ లో లోని పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ వేడుకలకు ఏకంగా మూడు లక్షల మంది అభిమానులు హాజరయ్యారు అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ సందర్భంలో అల్లు అర్జున్ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ .. ఆర్మీ అల్లు అర్జున్ ఆర్మీ అంటూ పేర్కొనడం చూస్తున్నాం.

అయితే అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని పేర్కొనడంపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన అభిమానులను 'అల్లు అర్జున్ ఆర్మీ ' అని పిలవడం పై 'గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ' అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆర్మీ అంటే దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన సంస్థ అనీ, దేశభద్రతకు సంబంధించిన అంశం అని ఆ సంస్థ పేర్కొంది. ఇంత గొప్ప ఆర్మీ అనే పదాన్ని అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని ఎలా పిలుస్తారని ఆ సంస్థ అధ్యక్షులు బైరి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్మీ అంటే జాతీయ సమగ్రత, జాతీయ భద్రత, సాలిడారిటి అంశమని పేర్కొన్నారు. అల్లు అర్జున్ తన అభిమానులకు ఆర్మీ అని పేరు పెట్టుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. అభిమాన సంఘానికి 'ఆర్మీ'అని పేరు పెట్టుకున్న అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరుతూ హైదరాబాదులోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు నమోదు చేయాలా? లేదా? అనే విషయాన్ని పరిశీలనలో పెట్టామని పోలీసులు పేర్కొన్నారు.
ఇదెలా ఉంటే.. దాదాపు మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'పుష్ప' పార్ట్ 1 తర్వాత పార్ట్ 2తోనే ప్రేక్షకులను పలకరించనున్నారు. పుష్ప 1 ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకిగానూ బన్నీ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోన్న విషయం తెలిసిందే. ఇలా పలు అంశాల్లో 'పుష్ప 2' (Pushpa 2: The Rule)పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 1000 కోట్ల ప్రి రిలీజ్ జరిగినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











