twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్ బెదిరింపు: ఇళయారాజాపై పోలీసులకు ఫిర్యాదు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మీద కంప్లైంట్ నమోదైంది. ఏజిఐ మ్యూజిక్ సంస్థ అధినేత అఖిలన్ ఆయనపై ఫిర్యాదు చేసారు. ఇళయరాజా పాటలకు సంబంధించి 2007లో తమ సంస్థ ఒక ఒప్పందం కుదుర్చుకుందని, ఈ ఒప్పందం కాల పరిమితి ముగియకుండానే ఇళయరాజా వేరే ఆడియో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని అఖిలన్ ఆరోపించారు. అంతే కాకుండా....అభిమానుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఆ ఫిర్యాదు సంగతి అలా ఉంటే... ఏజిఐ మ్యూజిక్ సంస్థ తన పాటలను తస్కరిస్తోందంటూ ఇళయరాజా చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్‌కు ఇంతకు ముందే ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని, పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా తాము ఇతర సినిమాల సీడీలను కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉందని అఖిలన్ ఆరోపించారు.

    Police Complaint against Ilayaraja

    ఇళయారాజా అభిమానులను తమను ఇంటర్నెట్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని, చంపేస్తామంటున్నారని....అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అఖిలన్ తెలిపారు.

    English summary
    Music company owner complained against popular music director Isaignani Ilayaraja in Chennai. Earlier Ilayaraja complained to Chennai Police Commissioner Geroge alleging that AGI Music company is stealing his songs. Chennai police started investigating on the complaint.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X