»   » అల్లు అర్జున్ కారు ధ్వంసం: పోలీస్ స్టేషన్లో పంచాయితీ!

అల్లు అర్జున్ కారు ధ్వంసం: పోలీస్ స్టేషన్లో పంచాయితీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ కారు ధ్వంసం కేసుకు సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన పంచాయితీ హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ కారును ఢీ కొట్టిన క్యాబ్ డ్రైవర్.... డబ్బులు కట్టమని అడిగితే పోలీసులను ఆశ్రయించడమే ఈ పంచాయితీకి కారణం.

అల్లు అర్జున్‌ కారును శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.1 నుంచి వెళ్తుండగా ఓ క్యాబ్‌ వెనక్కి తీసే క్రమంలో ఆయన కారుకు తగిలింది. కారు ధ్వంసం అయింది కాబట్టి మరమ్మత్తులకు డబ్బులు ఇవ్వాలంటూ.... అల్లు అర్జున్ కారు డ్రైవర్ మహిపాల్ క్యాబ్‌ డ్రైవర్‌ రామకృష్ణను రూ. 2 లక్షలు డిమాండ్‌ చేసినట్లు సమాచారం.

అల్లు అర్జున్ ఇంటి వద్ద కారు వదిలేసిన క్యాబ్ డ్రైవర్

అల్లు అర్జున్ ఇంటి వద్ద కారు వదిలేసిన క్యాబ్ డ్రైవర్

ఇపుడు తన వద్ద డబ్బులు లేని, ఆదివారం ఉదయం వచ్చి డబ్బులు ఇస్తానని సదరు క్యాబ్ డ్రైవర్ తన క్యాబ్ ను అల్లు అర్జున్ ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు.

పోలీసులను ఆశ్రయించిన రామకృష్ణ

పోలీసులను ఆశ్రయించిన రామకృష్ణ

కారు మరమ్మత్తు ఖర్చు రూ.2 లక్షలు అవుతుందని మహిపాల్ తెలపడంతో అంత చెల్లించుకోలేనని చెప్పిన రామకృష్ణ ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ ను ఆశ్రయించాడు. అల్లు అర్జున్ కారు డ్రైవర్ తనను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

కేసు పెట్టని పోలీసులు

కేసు పెట్టని పోలీసులు

అంత సీరియస్ ఇష్యూ కాక పోవడంతో రామకృష్ణ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. మహిపాల్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఇద్దరు డ్రైవర్లతో మాట్లాడారు ఎలాంటి కేసు లేకుండా ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ జోక్యం చేసుకున్నట్లు సమాచారం.

బన్నీ గురించి మరిన్ని

బన్నీ గురించి మరిన్ని

అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Police complaint filed on Allu Arjun’s car driver Mahipal Reddy. As per the report, Allu Arjun’s car hit by a cab. Cab driver Rama Krishna went to police station and filed a case against Mahipal Reddy who grabbed his cab.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu