పవన్ కళ్యాణ్ ‘కొడకా’: పరువు పోతోంది, ఎట్లా బ్రతికేది, కోపంగా ‘కోటేశ్వరరావులు’, కేసు...

By Bojja Kumar

Recommended Video

అజ్ఞాతవాసి తొలి రివ్యూ వచ్చేసింది.. పవన్ కుమ్మేశాడు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' సినిమా మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాతల మీదకు ఊహించని కేసు వచ్చి పడింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాడిన 'కొడకా కోటేశ్వరరావు' అనే పాటను వెంటనే నిషేధించాలని, సినిమా నుండి తొలగించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది.

మా మనో భావాలు దెబ్బతినేలా పాట ఉంది

మా మనో భావాలు దెబ్బతినేలా పాట ఉంది

ఈ పాట వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోటేశ్వ‌ర‌రావుల పరువు పోతోందని, కోటేశ్వ‌ర‌రావు పేరుగ‌ల వారి మ‌నోభావాలు దెబ్బ‌తింటున్నాయని.... విజయవాడకు చెందిన కోటేశ్వ‌ర‌రావు అనే న్యాయ‌వాది ఈ పాట‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ మాచ‌వ‌రం పోలీస్ స్టేష‌న్‌లో ఆయ‌న‌ ఫిర్యాదు చేశారు.

పరువు పోతోంది

పరువు పోతోంది

నాకు సినిమా గురించి పెద్దగా తెలియదు. రోజూ కోర్టుకు వెళ్లి వస్తుంటే అందరూ పరువు తీస్తున్నారు. ఈ మ‌ధ్య మా అన్న‌య్య పిల్ల‌లు, అక్క‌య్య పిల్ల‌లు మా ఇంటికి వ‌చ్చారు. వారు మ‌న బాబాయి పేరు కోటేశ్వ‌ర‌రావు క‌ద‌రా అని మాట్లాడుకుంటున్నారు. నా ముందే కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు అని పాట పాడుతున్నారు. నాకు చాలా బాధేసింది.... అని కోటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలా బ్రతికేది?

ఎలా బ్రతికేది?

పిల్లలను భావి పౌరులుగా తీర్చిద్దే టీచర్లు ఎంతో మంది కోటేశ్వరరావు అని పేరు గలవారు ఉంటారు. ఈ పాట మూలంగా వారు తలెత్తుకుని స్కూలుకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. పిల్లలు ఎగతాళి చేస్తోంటే ఎట్లా బ్రతికేది? వెంటనే ఈ పాటను తొలగించాలి, బ్యాన్ చేయాలి..... ఇందుకోసం తెలుగు రాష్ట్రాల్లోని కోటేశ్వరరావులు అంతా ఏకం కావాలి అని న్యాయవాది కోటేశ్వరరావు కోరారు.

ఈ కేసు చూసి ఆశ్చర్య పోతున్న అభిమానులు

ఈ కేసు చూసి ఆశ్చర్య పోతున్న అభిమానులు

తమ అభిమాన హీరో సినిమాపై, అందులో తమకు ఇష్టమైన పాటపై ఇలాంటి కేసు నమోదు కావడంపై అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇలా అయితే సినిమాలు తీయలేమని, ఈ కేసును అంగీకరిస్తే ఇక ప్రతి సినిమాపై కేసులు పడతాయని అంటున్నారు.

విదేశాల్లోనూ క్రేజ్ ఉంది, ఇక్కడ ఈ అభ్యంతరం ఏమిటో..?

విదేశాల్లోనూ క్రేజ్ ఉంది, ఇక్కడ ఈ అభ్యంతరం ఏమిటో..?

‘కొడకా కోటేశ్వరరావు' పాటకు విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉందని, మన బాష తెలియని కుర్రాళ్లుకూడా పవన్ కళ్యాణ్ పాడిన పాటకు ఫిదా అయిపోతున్నారని.... అలాంటిది మన తెలుగు వాళ్లు ఇలా అభ్యంతరం తెలపడం ఏమిటని కొందరు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలండ్ బుజ్జిగాడు

‘కొడకా కోటేశ్వరరావు' ఈ పాటను యూకెలో ఉంటున్న పోలండ్ బుజ్జిగాడు పాడటం సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసింది. అసలు తెలుగు తెలియని 8 ఏళ్ల జెబిగ్స్ బుజ్జి అనే కుర్రాడు ముద్దు ముద్దుగా ఆ పాట పాడటం అందరినీ ఆకట్టుకుంది.

పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చాడు

పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చాడు

పోలండ్ బుజ్జిగాడు పాడిన పాటకు ఫిదా అయిపోయిన పవన్ కళ్యాణ్.... "డియర్ జెబిగ్స్ బుజ్జీ... మై డియర్ లిటిల్ ఫ్రెండ్, పాట రూపంలో నువ్విచ్చిన న్యూ ఇయర్ గిఫ్టుకు థాంక్స్. నువ్వు పంపిన సందేశం నాకు చేరింది. గాడ్ బ్లెస్ యూ'' అంటూ ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు.

కొడకా కోటేశ్వరరావు

కొడకా కోటేశ్వరరావు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమాలో కొడకా కోటేశ్వర్ రావు అనే పాట పాడిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31న సాయంత్రం ఈ పాట విడుదలవ్వగా ఇప్పటికే 10 మిలియన్ పైగా హిట్స్ వచ్చాయి.

అజ్ఞాతవాసి

అజ్ఞాతవాసి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి' సినిమా జనవరి 10న విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. కుష్భూ, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

హాట్రిక్ ఖాయమేనా?

హాట్రిక్ ఖాయమేనా?

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' చిత్రం భారీ విజయం అందుకున్నారు. వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాతో వీరు హాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X