యాక్సిడెంట్ తో నిర్మాత, హీరోయిన్ ఎఫైర్ బయిటపడింది
విధి చాలా విచిత్రమైనదని సినిమాల్లో చాలా భారంగా డైలాగులు చెప్తూంటారు.ప్రస్తుతం కన్నడ నటి పూజాగాంధీ అదే డైలాగును తలుచుకుంటూ ఉండి ఉండవచ్చు.ఆమెకీ కన్నడ నిర్మాత కిరణ్ కుమార్ కీ చాలా కాలంగా రిలేషన్ ఉందిట.అతన్ని పట్టుకునే ఆమె ఎదిగిందని,ఆమె సిస్టర్ ని కూడా ఫీల్డ్ లోకి తెచ్చిందని చెప్తూంటారు.అయితే ఈ విషయం అందరికీ తెలిసినా బహిరంగ రహస్యంగా గుట్టుగా ఉంటూ వచ్చింది.
అయితే రీసెంట్ గా పూజాగాంధీ కారుకి యాక్సిడెంట్ అవ్వటంతో విషయం బయిటకు వచ్చింది. ఆ కారు ఆ నిర్మాతది.దాంతో పోలీసులు ఆ నిర్మాతను కోర్టుకు హాజరు అవమన్నారు.అయితే కోర్టుకు వెళ్ళటం ఇష్టపడని నిర్మాత ఆ కారుని చాలా కాలంగా పూజాగాంధీనే వాడుకుంటోందంటూ విషయం బయిటపెట్టారు.
అయితే పూజాగాంధీ మాత్రం అబ్బే ఆ ఒక్కరోజే వాడాను.నా కారు రిపేర్ రావటంతో అని బొంకేసింది.పోలీసులు మాత్రం వెంటనే రంగంలోకి దిగి ఆ కారు ని ఆమె చాలా కాలంగా వాడుతున్నట్లు తేల్చేసారు.అంతేగాక ఆ నిర్మాత ఆస్ధులు కొన్ని ఆమె పేరట ట్రాన్స్ ఫర్ అవటాన్ని కూడా బయిటపెట్టేసారు.అయితే ఇప్పటికీ తనను పోలీసుల వద్ద తనను ఇరికించవద్దని నిర్మాత ఎస్.ఎమ్.ఎస్ లు పంపుతున్నారని పోలీస్ లు వద్ద వాపోతోంది.


Click it and Unblock the Notifications











