twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ పార్టీ వల్ల రచ్చ: ఎలాంటి కేసు పెట్టని పోలీసులు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, అతని స్నేహితులైన ఎమ్మల్యే తీగల కృష్ణారెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడు, మరికొందరు కలిసి జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 25 లోని రామ్ చరణ్ తన నివాసంలో శనివారం రాత్రి పార్టీ చేసుకోవడం, భారీగా లౌడ్ స్పీకర్లు పెట్టి గోల చేయడం చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగిన సంగతి తెలిసిందే.

    దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అర్ధరాత్రి దాటాక పోలీసులు అక్కడికి రావడం, ఇతరకు డిస్ట్రిబెన్స్ కలిగించొద్దని వార్నింగ్ ఇవ్వడం, వారు వినక పోవడంతో రామ్ చరణ్ అతని స్నేహితులపై కేసు నమోదు చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయమై పోలీసులు స్పందిస్తూ ఎలాంటి కేసు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. తామె చెప్పిన వెంటనే వారు చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించకుండా మ్యూజిక్ సౌండ్స్ ఆపేసి లోనికి వెళ్లి పోయారని, అందుకే ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు స్పష్టం చేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Police did not register FIR on Ram Charan

    ఇదీ సంగతి..
    రామ్ చరణ్, అతని స్నేహితుల కారణంగా చుట్టుపక్కల వారు రాత్రిపూట నిద్రలేక ఇబ్బంది పడ్డారు. దీంతో ఆ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతం సవాంగ్ 100 కి ఫోన్ చేసి పోలీస్ లకు సమాచారం అందించారు. పోలీసులు రావడంతో గొడవ సద్దుమనిగింది.

    గతంలో కూడా రామ్ చరణ్ రోడ్డుపై జరిగిన గొడవ విషయంలో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బాడీగార్డులు ఇద్దరు వ్యక్తులను చితకబాదారు. రామ్ చరణ్ ఆదేశాల మేరకే వారు అలా రోడ్డుపై రెచ్చిపోయారనే వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

    English summary
    Police responded to a phone call by Tollywood actor Ram Charan Teja’s neighbours about a ruckus. “Apart from Ram Charan, the sons of politicians Lagadapati Rajagopal and Teegala Krishna Reddy were there. Our officer asked them not to disturb the neighbours, and they agreed and went inside,” said a senior official from Jubilee Hills police station.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X