హీరో ‘రవితేజ’ పై పోలీస్ డేగ కన్ను!
ఈ మద్య హీరో రవితేజ సినిమా జీవితంలోనే కాక, వ్యక్తిగతంగా కూడా అటు ప్రేక్షకులకు, ఇటు సినిమా ఇండస్ట్రీ వారికి కిక్ ఇస్తున్నాడు. మెన్న ఆ మధ్య తను వారి కుంలం వారితో సఖ్యంగా వుండటం, అంతేకాకుండా గ్రూపులు ఇవీ అవీ అంటూ ఓ ప్రముఖ కథానాయకుడి చేతిలో దెబ్బలు తిన్నాడని వార్తలకెక్కడం తెలిసిందే. ఇప్పడు మరో రోకంగా పోలీసుల కంట బడ్డాడు.
హీరో రవితేజ తుపాకి కావాలని పోలీసుల దగ్గర దరఖాస్తు పెట్టుకున్నాడు. అసలు రవితేజకు తుపాకీ అవసరమేముందని పోలీసులు ఆరా తీసారట. తీరా విషయం ఏమని తెలుకొంటే తుపాకీ కావాల్సింది రవితేజకు కాదు. రవితేజ తమ్ముడికి. రవితేజ తమ్ముడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ బిజినెస్ టో రకరకాల రిస్కులు ఉంటాయి కాబట్టి తన తమ్ముడు చేతిలో గన్ ఉండటం అవసరం అని రవితేజ అనుకుంటున్నాడట. అందుకే గన్ కోసం అప్లయ్ చేసుకున్నాడు. మరి పోలీసులు రవితేజకి లైసెన్స్ ఇవ్వడానికి రెండు మూడు సార్లు అలోచిస్తున్నారట ఎందుకంటే హీరో బాలకృష్ణ మరియు నిర్మాత బెల్లం కొండ సురేష్ మధ్య జరిగిన ఫైర్ కేసు తెలిసిందే. మరి పోలీసులు రవితేజకు లైసెన్స్ తుపాకీ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











