వేషం ఎర చూపి మోసం, మాజీ విలన్ పై కేసు
బాలీవుడ్ లో సాఫ్ట్ విలన్ వేషాలకు పేరు గాంచిన సీనియర్ నటుడు ప్రేమ్ చోప్రా ఓ ప్రాడ్ కేసులో ఇరుక్కున్నారు. రాజస్ధాన్ లోని జూపిటర్ లో ఆయనపై కేసు బుక్ అవ్వటంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేసారు. సినిమాల్లో వేషం ఇప్పిస్తానని, తమ డ్రామా,యాక్టింగ్ స్కూల్లో పార్టనర్ షిప్ ఇస్తానని జనాల్ని మోసం చేసాడని ఆయనపై ఎఫ్.ఐ.ఆర్ బుక్ అయ్యి ఉంది. సుభాష్ చౌక్ పోలీస్ స్టేషన్ లో ఈ కంప్లైంట్ ని వసీం అక్రమ్ అనే వ్యక్తి చేసారు. రామాగ్రహ్ రోడ్ లో నివసించే తన వద్ద చాలా డబ్బు లాగారని, తనకు వేషాలు ఆశచూపి తనను మోసం చేసారని వసీం కంప్లైంట్ లో రాసారు.
ఇక ప్రేమ్ చోప్రా ఒక్కడి మీదే కాకుండా సలీమ్ ప్రొడక్షన్స్ కు చెందిన సలీం, ఆయన భార్య రాధా,కొరియోగ్రాఫర్ సుజాత బక్షి,రాకేష్ పాండేలను కూడా ఈ కేసులో ఇమిడ్చారు. తనను మొదట సలీం సినిమా తీస్తానని డబ్బు తీసుకున్నాడని,ఆ తర్వాత ప్రేమ్ చోప్రా కూడా ఇందులో ఇన్వాల్స్ అయ్యి నమ్మించాడని ఆరోపించాడు. ఇక తన వద్ద మూడు లక్షల యాభై వేలు తీసుకున్నారని,ఆ మొత్తం తనకు ఇప్పించవలిసింది అని వసీం కోరుతున్నాడు.


Click it and Unblock the Notifications











