twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Anchor Siva : బయటకు వచ్చీ రాగానే రచ్చ.. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ పోలీసులు ఫైర్.. అసలు ఏమైందంటే?

    |

    తెలుగులో ఓటీటీ సీజన్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ నాన్ స్టాప్ శనివారం నాడు అంతే అట్టహాసంగా ముగిసింది. అయితే ఈ షోలో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలబడిన యాంకర్ శివ మీద పోలీసులు ఫైర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    టాప్ 3 కంటెస్టెంట్ గా

    టాప్ 3 కంటెస్టెంట్ గా

    ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ షోలో కి 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒక కంటెస్టెంట్ రీ ఎంట్రీ ఇవ్వగా మరో కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఎలా అయితేనేమి చివరికి ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసరికి ఏడుగురు సభ్యులు టైటిల్ కోసం పోటీ పడ్డారు.

    అయితే ముందుగా మిత్రశర్మ, అనిల్ రాథోడ్, బాబా భాస్కర్, అరియనా గ్లోరీ ఎలిమినేట్ కాగా తరువాత యాంకర్ శివ టాప్ 3 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు.

    ఈ స్థానానికి రాగలిగా

    ఈ స్థానానికి రాగలిగా

    అయితే ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సమయంలో బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందని నాగార్జున చెప్పడంతో యాంకర్ శివ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేకాక ఎక్కడినుంచో వచ్చిన తనకు ఇంత గొప్ప అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రేక్షకులు తనను ఎంతో ఆదరించారు కాబట్టే ఈ స్థానానికి రాగలిగా అని చెప్పుకొచ్చారు.

    ప్రశంసల వర్షం

    ప్రశంసల వర్షం

    ఇక అదే సమయంలో తన తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు అని చెబుతూ వారిని కూడా స్టేజి మీదకు తీసుకువచ్చాడు యాంకర్ శివ. ఒక డ్రైవర్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడి వరకు రావడం గొప్ప విషయం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

    యాంకర్ శివకు క్లాస్

    యాంకర్ శివకు క్లాస్

    అయితే షో ముగిసిన తర్వాత యాంకర్ శివ బయటకు వచ్చి ఇంటికి వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది.ఆయన ఓ ఓపెన్ టాప్ కారులో పైకి వెళుతూ ఉండగా అభిమానులు చుట్టుముట్టి ఆయనను కొంచెంసేపు అక్కడి నుంచి కదలనివ్వలేదు. అదే సమయంలో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇలా కార్ టాప్ మీదకు రావడం కరెక్ట్ కాదని మీరు అలా వచ్చినందుకే అభిమానులు ఇలా అడ్డం పడుతున్నారని యాంకర్ శివకు క్లాస్ పీకారు.

    పెద్ద ఎత్తున

    దయచేసి వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటూ ఆయనను కోరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో కూడా ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తున్న సమయంలో పెద్ద ఎత్తున వారికోసం ర్యాలీలు నిర్వహించేందుకు ఫాన్స్ సిద్ధంగా ఉన్న సమయంలో కూడా పోలీసులు అభ్యంతరం తెలిపి వారిని అక్కడి నుంచి పంపించేసేవారు.

    లక్షల రూపాయలు

    లక్షల రూపాయలు

    ఇక ఈ ర్యాలీల కోసం ఈ సరి బిగ్ బాస్ కంటెస్టెంట్ లు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అంటూ సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తమకు బయట క్రేజ్ వుంది అని చెప్పుకోవడం కోసం బయటకు రాగానే భారీ ఎత్తున జనాన్ని సమీకరించి ఇలా ప్లాన్ చేస్తున్నారు అనే వాదన వినిపిస్తోంది.

    English summary
    Police serious on bigg boss non stop fame anchor siva.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X