బాలయ్య, చిరుల మధ్య చిచ్చు ఐ హేట్ బాలయ్య నిర్వాహకుడిదే
ప్రముఖ సినీనటుడు బాలకృష్ణను కించపరిచేలా ఉన్న 'ఐ హేట్ బాలయ్య డాట్‌కాం' వెబ్‌సైట్ నిర్వాహకుడిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీచేసింది. హైదరాబాద్ క్రైమ్ కంట్రోల్ స్టేషన్ (సీసీఎస్) అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బాలకృష్ణ ఫిర్యాదు మేరకు కేసును పరిశోధిస్తున్న సీసీఎస్ అధికారులు ఈ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర చిరంజీవి యువత కూడా 'ఐ హేట్ చిరంజీవి' వెబ్‌సైట్‌పై సీసీఎస్‌కు ఫిర్యాదు చేసింది.
ఈ కేసునూ పరిశోధిస్తున్న సమయంలో రెండు వెబ్‌సైట్ల సృష్టికర్త ఒకరేనని తేలింది. ఆ వ్యక్తి 2008లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఇద్దరు అగ్ర హీరోల పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించిన వ్యక్తిని అరెస్ట్ చేయటానికి ఇంటర్‌పోల్ సహాయాన్ని అర్థించినట్టు డీసీపీ (నేరాలు) జె.సత్యనారాయణ గురువారం తెలిపారు. వీలైనంత త్వరలో నిందితుడిని హైదరాబాద్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications